తొలి దేశీ బ్రౌజర్ @ భారత్

యాంటీ చైనా సెంటిమెంట్‌తో దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఇండియన్ కంపెనీలు కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. అందుకోసం ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. చైనా యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధించాలంటూ నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. టిక్‌టాక్‌కు ఆల్టర్‌నేటివ్‌గా వచ్చిన దేశీ యాప్స్‌ మిత్రోన్, చింగారీ డౌన్‌లోడ్ల సంఖ్య పెరిగింది. అటు దేశీ మొబైల్ కంపెనీలైన మైక్రోమ్యాక్స్, లావా, జోలోలు కూడా కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించాయి. […]

Update: 2020-06-26 01:08 GMT

యాంటీ చైనా సెంటిమెంట్‌తో దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఇండియన్ కంపెనీలు కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. అందుకోసం ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. చైనా యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధించాలంటూ నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. టిక్‌టాక్‌కు ఆల్టర్‌నేటివ్‌గా వచ్చిన దేశీ యాప్స్‌ మిత్రోన్, చింగారీ డౌన్‌లోడ్ల సంఖ్య పెరిగింది. అటు దేశీ మొబైల్ కంపెనీలైన మైక్రోమ్యాక్స్, లావా, జోలోలు కూడా కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో.. బెంగళూరుకు చెందిన బ్లూస్కై ఇన్వెన్షన్స్ అనే స్టార్టప్ కంపెనీ తొలి దేశీ బ్రౌజర్ ‘భారత్’ను లాంచ్ చేసింది.

భారతీయ భాషలను సపోర్టు చేసేలా ఈ భారత్ వెబ్ బ్రౌజర్‌ను అభివృద్ధి చేశారు. ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఆధారంగా పనిచేసే ఈ బ్రౌజర్ సైజ్ 8.2ఎమ్‌బీ మాత్రమే. కాగా భారత్ నుంచి వచ్చిన తొలి బ్రౌజర్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో ‘భారత్ బ్రౌజర్’ అందుబాటులో ఉంది.

ఫీచర్స్

ఇందులో యూజర్లు గేమ్స్ ఆడుకునే అవకాశం ఉంది. లోకల్ న్యూస్ అప్‌డేట్స్‌ను చెక్ చేసుకోవచ్చు. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల పాపులర్ కంటెంట్‌ను సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ట్రావెల్ సమాచారంతో పాటు క్రీడల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు యూజర్లు.. వీడియోస్ సెక్షన్ నుంచి వీడియోలను వాచ్ చేయొచ్చు. తొమ్మిది ప్రధాన భారతీయ భాషల్లో లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్‌ విశేషాలను కూడా ఇందులో చూసుకోవచ్చు.

కిడ్స్ స్పెషల్

చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఓ సెక్షన్‌‌ను కేటాయించారు. ప్రీలోడెడ్ కిడ్స్ వీడియోలు, రైమ్స్, షాపింగ్, గేమ్స్ ఈ బ్రౌజర్‌లో అందుబాటులో ఉన్నాయి.

‘వాస్తవానికి గూగుల్ ప్లే స్టోర్‌’లో ఎన్నో బ్రౌజర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, అందులో ఒక్కటి కూడా భారతీయ బ్రౌజర్ లేదు. దేశంలో 500M+ మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. వారి కోసమే ప్రత్యేకంగా ఈ కొత్త బ్రౌజర్ లాంచ్ చేశాం. భారతీయ కంటెంట్ అందించాలనే ఉద్దేశంతోనే భారత్ బ్రౌజర్ డెవలెప్ చేశాం’ అని కంపెనీ సహ వ్యవస్థాపకులు, సీఈఓ దినేష్ ప్రసాద్ వెల్లడించారు.

Tags:    

Similar News