ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని పర్యవేక్షిస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల అధికార యంత్రాంగాన్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో 24 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సహాయక చర్యల కోసం ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. సహాయక చర్యల్లో అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. కృష్ణానదీ తీరం వెంబడి అధికారులు […]

Update: 2021-08-05 21:17 GMT
Prakasam Barrage
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని పర్యవేక్షిస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల అధికార యంత్రాంగాన్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో 24 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సహాయక చర్యల కోసం ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. సహాయక చర్యల్లో అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. కృష్ణానదీ తీరం వెంబడి అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దన్నారు.

Tags:    

Similar News