రష్యాలో తొలి కరోనా వ్యాక్సిన్ విడుదల

దిశ, వెబ్ డెస్క్: రష్యా తొలి కరోనా(corona) టీకా(vaccine)ను అభివృద్ధి చేసిందని దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఆరోగ్య సహా ఇతర మంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఆయన టీకాను లాంచ్ చేశారు. ఈ టీకాపై అవసరమైన అన్ని టెస్టులు నిర్వహించారని పేర్కొన్నారు. అంతేకాదు, తన ఇద్దరు కూతుళ్లలో ఒకరికి టీకా ప్రయోగించారని, ఆమె ఆరోగ్యంగానే ఉన్నదని వెల్లడించారు. ప్రపంచంలో(world)నే తొలి కరోనా టీకాను అభివృద్ధి చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచానికి ఇదొక […]

Update: 2020-08-11 05:24 GMT

దిశ, వెబ్ డెస్క్: రష్యా తొలి కరోనా(corona) టీకా(vaccine)ను అభివృద్ధి చేసిందని దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఆరోగ్య సహా ఇతర మంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఆయన టీకాను లాంచ్ చేశారు. ఈ టీకాపై అవసరమైన అన్ని టెస్టులు నిర్వహించారని పేర్కొన్నారు. అంతేకాదు, తన ఇద్దరు కూతుళ్లలో ఒకరికి టీకా ప్రయోగించారని, ఆమె ఆరోగ్యంగానే ఉన్నదని వెల్లడించారు.

ప్రపంచంలో(world)నే తొలి కరోనా టీకాను అభివృద్ధి చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచానికి ఇదొక గొప్ప శుభవార్త అని వివరించారు. దేశ పరిశోధన సంస్థ టీకాలను పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తుందని అన్నారు. టీకా సమర్థంగా పనిచేస్తుందన్న నమ్మకం తనకున్నదని చెబుతూనే వ్యాక్సిన్ గురించి ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాల్సిందిగా ఆరోగ్య మంత్రి(health minister) మిఖేల్ మురష్కొకు సూచించారు. ట్రయల్స్ కొనసాగుతుండగానే, టీకా ఉత్పత్తి జరుగుతుందని మురష్కొ వివరించారు.

షరతులకు లోబడి టీకా రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిపారు. కాగా, టీకా రిజిస్టర్ అయ్యాక వ్యాక్సినేషన్‌(ప్రజలకు టీకా ఇవ్వడం)కు కావల్సిన నిధులు అందేలా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. గమేలియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (gamelia research institute) రక్షణ శాఖ(defence department) సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి చేశాయి. ఒకవైపు ట్రయల్స్ జరుగుతుండగానే, ప్రజలకు అందుబాటులోకి ఈ టీకాను రష్యా తీసుకువస్తున్నది. జూన్ 18న 38 వాలంటీర్లపై ఈ టీకా క్లినికల్ ట్రయల్స్‌(clinical trails) ప్రారంభమయ్యాయి. అందరిలోనూ ఇమ్యూనిటీ(immunity) పెరిగినట్టు రిపోర్టు చేశారు. తొలి గ్రూపును జులై 15న, రెండో గ్రూపును జులై 20న డిశ్చార్జ్ చేశారు. ట్రయల్స్ వ్యవధిని కుదించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సూచనల మేరకు వేగంగా ట్రయల్స్ నిర్వహించారు. అయితే, ఈ ట్రయల్స్ విశ్వసనీయతపై నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో యూఎస్ టాప్ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ అంథోని ఫౌచీ కూడా ఉన్నారు.

Tags:    

Similar News