ఢిల్లీ ఎయిమ్స్: దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటికే చావునోట్లో తలపెట్టి వచ్చిన వారిని మరో వైరస్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దేశవ్యాప్తంగా.. బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరిస్తూ వణికిస్తోంది. తాజాగా.. బర్డ్ ఫ్లూతో 12 ఏళ్ల బాలుడు ఢిల్లీ ఎయిమ్స్‌లో చనిపోయాడు. దీంతో బాలుడికి చికిత్స అందించిన వైద్యులు, సిబ్బంది ఐసోలేషన్‌కు వెళ్లారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయాలని వైద్యనిపుణులు వారికి సూచించారు. అంతేగాకుండా.. భారత్‌లో బర్డ్ ఫ్లూ వచ్చి వ్యక్తి చనిపోవడం ఇదే […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటికే చావునోట్లో తలపెట్టి వచ్చిన వారిని మరో వైరస్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దేశవ్యాప్తంగా.. బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరిస్తూ వణికిస్తోంది. తాజాగా.. బర్డ్ ఫ్లూతో 12 ఏళ్ల బాలుడు ఢిల్లీ ఎయిమ్స్‌లో చనిపోయాడు. దీంతో బాలుడికి చికిత్స అందించిన వైద్యులు, సిబ్బంది ఐసోలేషన్‌కు వెళ్లారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయాలని వైద్యనిపుణులు వారికి సూచించారు. అంతేగాకుండా.. భారత్‌లో బర్డ్ ఫ్లూ వచ్చి వ్యక్తి చనిపోవడం ఇదే తొలిసారి. హర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యుమోనియా, లుకేమియా లక్షణాలతో ఈ నెల 2న ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరాడు. దీంతో పరీక్షించిన వైద్యులు మొదట కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. అనంతరం నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. అక్కడ బర్డ్ ఫ్లూగా తేలింది. దీంతో మరిన్ని కేసులను గుర్తించడానికి, కాంటాక్ట్ ట్రేస్ చేయడానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఓ బృందాన్ని హర్యానాలోని బాలుడి స్వగ్రామానికి పంపింది.