ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

దిశ, వెబ్‎డెస్క్: భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్‎ఫ్లో 4,31,484 క్యూసెక్కులుగా ఉండగా.. అదే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముంపు ప్రభావిత అధికారులను ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ముంపు ప్రభావిత ప్రజలు సహాయక […]

Update: 2020-10-13 21:05 GMT

దిశ, వెబ్‎డెస్క్: భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్‎ఫ్లో 4,31,484 క్యూసెక్కులుగా ఉండగా.. అదే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు.

వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముంపు ప్రభావిత అధికారులను ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ముంపు ప్రభావిత ప్రజలు సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని.. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.

Tags:    

Similar News