రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం
దిశ, కుత్బుల్లాపూర్: రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన బుధవారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జీడిమెట్ల పారిశ్రామిక వాడ పైప్ లైన్ రోడ్డులోని ప్రీమియర్ రసాయన పరిశ్రమలో బుధవారం సాయంత్రం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడ్డాయి. రసాయనాలు ఉండడంతో మంటలను అదుపు చేసేందుకు ఇబ్బందిగా మారింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో అందులో ఎవరూ […]
దిశ, కుత్బుల్లాపూర్: రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన బుధవారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జీడిమెట్ల పారిశ్రామిక వాడ పైప్ లైన్ రోడ్డులోని ప్రీమియర్ రసాయన పరిశ్రమలో బుధవారం సాయంత్రం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడ్డాయి. రసాయనాలు ఉండడంతో మంటలను అదుపు చేసేందుకు ఇబ్బందిగా మారింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో అందులో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం జరగలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.