వనస్థలిపురంలో అగ్ని ప్రమాదం.. మహిళ సజీవదహనం
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వనస్థలిపురంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం ఎఫ్సీఐ కాలనీలో నివాసముంటున్న బాలకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బాలకృష్ణ భార్య సరస్వతి మంటల్లో చిక్కుకొని సజీవదహనం అయ్యింది. మొదటి అంతస్తుల్లో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. స్వల్ప గాయాలతో బాలకృష్ణ, అతని ఇద్దరు పిల్లలు బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని […]
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వనస్థలిపురంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం ఎఫ్సీఐ కాలనీలో నివాసముంటున్న బాలకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బాలకృష్ణ భార్య సరస్వతి మంటల్లో చిక్కుకొని సజీవదహనం అయ్యింది. మొదటి అంతస్తుల్లో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. స్వల్ప గాయాలతో బాలకృష్ణ, అతని ఇద్దరు పిల్లలు బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసింది. అయితే మంటలు చెలరేగడానికి కారణం షార్ట్ సర్క్యూటే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారం చేపట్టారు.