సుల్తానాబాద్ కొవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..
దిశ, పెద్దపల్లి : సుల్తానాబాద్ పట్టణంలోని కరోనా ఐసోలేషన్ సెంటర్ ఆవరణలో అగ్నిప్రమాదం సంభవించగా తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఆస్పత్రి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టగా అది చుట్టుపక్కలకు విస్తరించింది. ఈ ఘటనలో ఆస్పత్రికి సంబంధించిన మంచినీటి పైపులు, కరెంటు మోటారు దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగడంతో ఆస్పత్రి మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఐసోలేషన్ సెంటర్లో దాదాపు 20 మంది పేషెంట్లు ఉండగా, పొగ వలన ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఆస్పత్రి వర్గాలను […]
దిశ, పెద్దపల్లి : సుల్తానాబాద్ పట్టణంలోని కరోనా ఐసోలేషన్ సెంటర్ ఆవరణలో అగ్నిప్రమాదం సంభవించగా తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఆస్పత్రి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టగా అది చుట్టుపక్కలకు విస్తరించింది. ఈ ఘటనలో ఆస్పత్రికి సంబంధించిన మంచినీటి పైపులు, కరెంటు మోటారు దగ్ధమయ్యాయి.
మంటలు చెలరేగడంతో ఆస్పత్రి మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఐసోలేషన్ సెంటర్లో దాదాపు 20 మంది పేషెంట్లు ఉండగా, పొగ వలన ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఆస్పత్రి వర్గాలను వివరణ కోరగా పొంతన లేని సమాధానం ఇచ్చారు. ఆసుపత్రి ప్రాంగణంలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో మంటలు విస్తరించి ప్రమాద జరిగిందని ప్రజలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.