మాస్క్ లేదని ఏడున్నర లక్షల జరిమానా
దిశప్రతినిధి, ఆదిలాబాద్: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారికి విధిస్తున్న జరిమానాలు భారీగానే నమోదు అవుతున్నాయి. ఒక్క నిర్మల్ జిల్లా కేంద్రంలోనే ఆరు రోజుల వ్యవధిలో సుమారు ఏడున్నర లక్షల రూపాయల జరిమానాలు వసూలు కావడం గమనార్హం. ఈ నెల 7వ తేదీ నుండి 12వ తేదీల మధ్య పట్టణ ఎస్సై దేవేందర్ ఆధ్వర్యంలో పోలీసులు టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించి.. వారిపై కేసులు నమోదు చేశారు. వారికి జరిమానాలు విధించారు. […]
దిశప్రతినిధి, ఆదిలాబాద్: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారికి విధిస్తున్న జరిమానాలు భారీగానే నమోదు అవుతున్నాయి. ఒక్క నిర్మల్ జిల్లా కేంద్రంలోనే ఆరు రోజుల వ్యవధిలో సుమారు ఏడున్నర లక్షల రూపాయల జరిమానాలు వసూలు కావడం గమనార్హం. ఈ నెల 7వ తేదీ నుండి 12వ తేదీల మధ్య పట్టణ ఎస్సై దేవేందర్ ఆధ్వర్యంలో పోలీసులు టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించి.. వారిపై కేసులు నమోదు చేశారు. వారికి జరిమానాలు విధించారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న 251 మందిని పట్టుకొని.. వారికి 2 లక్షల 51,000 విధించారు. అలాగే 6 రోజుల్లో 1,273 మంది కరోనా నిబంధనలు ఉల్లంఘంచి తిరుగుతున్నవారిని సీసీ కెమెరాల్లో గుర్తించి వారికి రూ. 4,79,580 జరిమానా విధించినట్లు సీఐ జాన్ దివాకర్ వెల్లడించారు.