హెల్మెట్ లేదని ట్రాక్టర్ డ్రైవర్‌కు ఫైన్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బైక్ నడిపే వారికి హెల్మెట్ లేదని పోలీసులు ఫైన్ వేయడం సాధారణం. కానీ ట్రాక్టర్ డ్రైవర్‌కు హెల్మెట్ లేదని ఫైన్ వేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం చించొల్లిలో సతీశ్ అనే ట్రాక్టర్ డ్రైవర్‌కు ఇలా చాలన్ రావడంతో అందరూ అవాక్కయ్యారు. గత నెల 25న మద్దికుంట మర్రి ఎక్స్‌రోడ్‌లో హెల్మెట్ లేకుండా బండి నడిపాడని రూ.135 మీసేవలో కట్టాలని అతనికి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి అతడు షాక్‌కు […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బైక్ నడిపే వారికి హెల్మెట్ లేదని పోలీసులు ఫైన్ వేయడం సాధారణం. కానీ ట్రాక్టర్ డ్రైవర్‌కు హెల్మెట్ లేదని ఫైన్ వేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం చించొల్లిలో సతీశ్ అనే ట్రాక్టర్ డ్రైవర్‌కు ఇలా చాలన్ రావడంతో అందరూ అవాక్కయ్యారు. గత నెల 25న మద్దికుంట మర్రి ఎక్స్‌రోడ్‌లో హెల్మెట్ లేకుండా బండి నడిపాడని రూ.135 మీసేవలో కట్టాలని అతనికి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి అతడు షాక్‌కు గురయ్యాడు. తాను బీర్కూర్, బాన్సువాడ మండలాల్లో తప్ప మరెక్కడికి ట్రాక్టర్‌ను తీసుకెళ్లడం లేదని, చాలన్‌లు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని అతడు వాపోతున్నాడు.
అయినా ట్రాక్టర్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాడు. గతంలో ఇలాగే మూడు చలాన్‌లు కట్టినట్టు వెల్లడించాడు. తర్వాత మళ్లీ తొమ్మిది చలాన్‌లు వచ్చాయని, ప్రస్తుతం హెల్మెట్ లేదని మరో చలాన్ వచ్చిందన్నాడు. పోలీసులు చాలన్ వేసి ఫొటోస్ అప్లోడ్ చేయడం లేదని, టార్గెట్ కోసమే ఇలా చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. కొందరు దొంగ వాహనాలకు ఇతర వాహనాల నెంబర్లు వాడటం వలన ఇలా చలాన్‌లు రావడం సాధారణమని పోలీసులు చెబుతున్నారు.