కేంద్రం నుంచి నయాపైసా రాలేదు : హరీశ్ రావు
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తనదైన శైలలిలో విమర్శలు చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. రైతు వేదికలతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక బిల్లుతో వారి గుండెల్లో గుబులు పుట్టిస్తోందని విమర్శించారు. బీజేపీ విధానాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ఏకంగా […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తనదైన శైలలిలో విమర్శలు చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. రైతు వేదికలతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక బిల్లుతో వారి గుండెల్లో గుబులు పుట్టిస్తోందని విమర్శించారు. బీజేపీ విధానాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ఏకంగా కేంద్ర మంత్రి రాజీనామా చేశారంటే..
అవి ఎంతగా ప్రభావితం చేస్తాయో ఆలోచించాలన్నారు. సీఎం కేసీఆర్ ఉచిత కరెంటు అందిస్తుంటే బీజేపీ ప్రభుత్వం కరెంటు మీటర్లు పెట్టి రైతుల నుంచి ముక్కు పిండి వసూలుచేయాలని చూస్తోందన్నారు. దుబ్బాక పోరు గడ్డ చైతన్యాన్ని బ్యాలెట్ ద్వారా చూపాలన్నారు. కేంద్రం నుంచి కరోనా సమయంలో నయాపైసా రాకున్నా… రైతుల పెట్టుబడికి ఇబ్బంది రావొద్దని పెట్టుబడి సాయాన్ని బ్యాంకుల్లో ముందే వేశామన్నారు.