ఎట్టకేలకు కేరళ మహిళకు నెగెటివ్
కరోనాతో 50 రోజులుగా పోరాడుతున్న కేరళకు చెందిన ఓ మహిళకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. 19 సార్లు చేసిన పరీక్షలో ఆమెకు పాజిటివ్ రిపోర్ట్ రాగా, తాజాగా వచ్చిన ఫలితాల్లో కరోనా నెగెటివ్ తేలింది. వివరాలు ఇలా.. పథనంతిట్ట జిల్లాలోని వదాసెరిక్కరకకు చెందిన 62 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. కేరళలో ప్రప్రథమంలో కరోనా సోకిన వారిలో ఈమె ఒక్కరు. దాదాపు 50 రోజులుగా ఆమె చికిత్స పొందుతుంది. 19 సార్లు చేసిన పరీక్షలో పాజిటివ్ రావడంతో […]
కరోనాతో 50 రోజులుగా పోరాడుతున్న కేరళకు చెందిన ఓ మహిళకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. 19 సార్లు చేసిన పరీక్షలో ఆమెకు పాజిటివ్ రిపోర్ట్ రాగా, తాజాగా వచ్చిన ఫలితాల్లో కరోనా నెగెటివ్ తేలింది. వివరాలు ఇలా.. పథనంతిట్ట జిల్లాలోని వదాసెరిక్కరకకు చెందిన 62 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. కేరళలో ప్రప్రథమంలో కరోనా సోకిన వారిలో ఈమె ఒక్కరు. దాదాపు 50 రోజులుగా ఆమె చికిత్స పొందుతుంది. 19 సార్లు చేసిన పరీక్షలో పాజిటివ్ రావడంతో ఆమెకు ఈనెల 14 నుంచి ‘ఇవర్‌మెక్టిన్’ మెడిసిన్‌ను ఇస్తున్నారు. దీంతో బుధవారం జరిపిన పరీక్షలో ఆమెకు నెగెటివ్ రావడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. నిబంధనల ప్రకారం మరోసారి నెగెటివ్ వస్తేనే ఆమెను ఆసుప్రతి నుంచి డిశ్చార్జి చేయనున్నారు.
Tags: kerala woman, carona, positive, negative