ఫిజి… ఇప్పుడు కరోనా వైరస్ ఫ్రీ!

కరోనా వైరస్ బారి నుంచి ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. లాక్‌డౌన్ కఠినంగా పాటించడం, సామాజిక దూరం శ్రద్ధగా నిర్వహించడం వల్ల చిన్న చిన్న దేశాలు కరోనా భూతాన్ని ముందుగా వదిలించుకోగలుగుతున్నాయి. ఈ బాటలోనే ఇప్పుడు ఫిజి దేశం కరోనా వైరస్ ఫ్రీ దేశంగా మారింది. 9,30,000ల మంది జనాభా ఉన్న ఫిజిలో మార్చి నెలలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అప్పుడే తేలికగా తీసుకోకుండా వెంటనే క్వారంటైన్ పనులు ప్రారంభించారు. కఠినంగా అన్ని నియమాలు […]

Update: 2020-06-05 04:47 GMT

కరోనా వైరస్ బారి నుంచి ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. లాక్‌డౌన్ కఠినంగా పాటించడం, సామాజిక దూరం శ్రద్ధగా నిర్వహించడం వల్ల చిన్న చిన్న దేశాలు కరోనా భూతాన్ని ముందుగా వదిలించుకోగలుగుతున్నాయి. ఈ బాటలోనే ఇప్పుడు ఫిజి దేశం కరోనా వైరస్ ఫ్రీ దేశంగా మారింది. 9,30,000ల మంది జనాభా ఉన్న ఫిజిలో మార్చి నెలలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అప్పుడే తేలికగా తీసుకోకుండా వెంటనే క్వారంటైన్ పనులు ప్రారంభించారు. కఠినంగా అన్ని నియమాలు పాటించడంతో ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసులను గరిష్టంగా 18 వద్దే ఉంచగలిగారు.

వారి ప్రార్థనలు, కష్టానికి ప్రతిఫలంగా తమ దేశం కరోనా వైరస్‌ని పూర్తిగా పారద్రోలగలిగిందని ఫిజి ప్రధాని ఫ్రాంక్ బైనిమరమా అన్నారు. టెస్టుల సంఖ్య పెంచి 45 రోజుల్లో చివరి కేసును గుర్తించామని, ఇప్పటివరకు ఒక్క కరోనా మరణం కూడా లేకుండా, 100 శాతం రికవరీ రేటు సాధించినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వైరస్ ప్రారంభమైన మొదట్లో పసిఫిక్ దేశాలు తీవ్రంగా నష్టపోతాయని అందరూ అనుకున్నారు. ఆ దేశాల ఆరోగ్య సదుపాయాలు, అక్కడి ప్రజలు ఆరోగ్య స్థితి కారణంగా కరోనా విజృంభిస్తే ఊహించరాని నష్టం జరుగుతుందని భావించారు. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక పక్కా ప్లాను ప్రకారం నియమ నిబంధనలు అమలు చేసి ఫిజి లాంటి దేశాలు కరోనాను సులభంగా జయిస్తున్నాయి.

Tags:    

Similar News