ఫిక్ పర్వతాన్ని అధిరోహించిన యువకుడు

దిశ,తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నూతనకల్ మండలం శిల్పకుంట్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు బొజ్జ నవీన్(20) ఏప్రిల్ 29న చైనా బార్డర్ లోని నార్త్ సిక్కిం ప్రాంతంలో ఉన్న 5800 మీటర్ల పొడవున్న ఫిక్ పర్వతాన్ని అధిరోహించాడు. ఈ పర్వతాన్ని అధిరోహించటానికి గత నెలలో తెలంగాణ రాష్ట్రం నుండి నలుగురు యువకులు వెళ్లగా, అందులో ఇద్దరు యువకులు మాత్రమే అధిరోహించారు. ఒకరు సూర్యాపేట జిల్లాకు చెందిన బొజ్జ నవీన్ కాగా, మరోకరు నాగర్ […]

Update: 2021-05-01 06:50 GMT

దిశ,తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నూతనకల్ మండలం శిల్పకుంట్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు బొజ్జ నవీన్(20) ఏప్రిల్ 29న చైనా బార్డర్ లోని నార్త్ సిక్కిం ప్రాంతంలో ఉన్న 5800 మీటర్ల పొడవున్న ఫిక్ పర్వతాన్ని అధిరోహించాడు. ఈ పర్వతాన్ని అధిరోహించటానికి గత నెలలో తెలంగాణ రాష్ట్రం నుండి నలుగురు యువకులు వెళ్లగా, అందులో ఇద్దరు యువకులు మాత్రమే అధిరోహించారు.

ఒకరు సూర్యాపేట జిల్లాకు చెందిన బొజ్జ నవీన్ కాగా, మరోకరు నాగర్ కర్నూలు జిల్లా కు చెందిన మల్లికార్జున్ అనే యువకుడు. ఏప్రిల్ 20వ తేదీన పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించిన వీరు 29వ తేదీన పర్వతాన్ని అధిరోహించి తెలంగాణ రాష్ట్రఖ్యాతిని ప్రపంచానికి చాటారు. కాగా పర్వతాన్ని అధిరోహించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఫోటోలను చూపిస్తూ వారికి గౌరవ అభినందనలు తెలిపాడు.

Tags:    

Similar News