హైదరాబాద్‌లో గ్లోబల్ డిజిటల్ హబ్
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాదులో గ్లోబల్ డిజిటల్ హబ్ ఏర్పాటు చేసేందుకు 150 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ బుధవారం ప్రకటించింది. ఉత్తర అమెరికా, ఈఎంఈఏ బయట నూతన ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధికి ఈ సంస్థ కృషి చేస్తోంది. 2021 సంవత్సరాంతం వరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కనీసం వెయ్యి మందికి ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉంది. వచ్చే రెండు, మూడు ఏండ్లల్లో ఈ సంఖ్యను మరింతగా పెంచే ప్రణాళికలు ఉన్నాయి. […]
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాదులో గ్లోబల్ డిజిటల్ హబ్ ఏర్పాటు చేసేందుకు 150 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ బుధవారం ప్రకటించింది. ఉత్తర అమెరికా, ఈఎంఈఏ బయట నూతన ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధికి ఈ సంస్థ కృషి చేస్తోంది. 2021 సంవత్సరాంతం వరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కనీసం వెయ్యి మందికి ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉంది. వచ్చే రెండు, మూడు ఏండ్లల్లో ఈ సంఖ్యను మరింతగా పెంచే ప్రణాళికలు ఉన్నాయి. హబ్ ద్వారా ఐటీ వ్యూహాలు, సాంకేతిక ఉత్తమ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. టెక్నాలజీని వాహనాల ప్రోగ్రామింగ్ లో వినియోగిస్తారు. డేటా యాక్సిలేటర్లు, క్లౌడ్ టెక్నాలజీలను వినియోగిస్తారు. దీని ప్రధాన ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. హైదరాబాదులో హబ్ ను స్థాపించడం ద్వారా మెరుగైన సేవలను అందిస్తామని సంస్థ ప్రెసిడెంట్, ఎండీ డా.పార్ధదత్త ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమ సాంకేతికత భవిష్యత్తు మొబిలిటీకి వెన్నెముకగా నిలుస్తుందన్నారు.