నోరు జారిన షోయబ్.. సమన్లు జారీ
దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ లెజండరీ బౌలర్ షోయబ్ అక్తర్ ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) లీగల్ అడ్వైజర్ తఫాజ్ఝుల్ రిజ్వీపై ఆయన చేసన కామెంట్లు తీవ్ర పరిణామాలకు దారి తీశాయి. తనను అసమర్థుడని అక్తర్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని రిజ్వీ పేర్కొంటూ 100 మిలియన్ రూపాయలు (పాకిస్తానీ కరెన్సీలో) పరువు నష్టం దావా వేశాడు. అవినీతి ఆరోపణల్లో భాగంగా క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై రిజ్వీ […]
దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ లెజండరీ బౌలర్ షోయబ్ అక్తర్ ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) లీగల్ అడ్వైజర్ తఫాజ్ఝుల్ రిజ్వీపై ఆయన చేసన కామెంట్లు తీవ్ర పరిణామాలకు దారి తీశాయి. తనను అసమర్థుడని అక్తర్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని రిజ్వీ పేర్కొంటూ 100 మిలియన్ రూపాయలు (పాకిస్తానీ కరెన్సీలో) పరువు నష్టం దావా వేశాడు. అవినీతి ఆరోపణల్లో భాగంగా క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై రిజ్వీ నేతృత్వంలోని కమిటీ మూడేండ్ల నిషేధం విధించింది. దీనిపైనే ఒక యూట్యూబ్ ఛానల్‌లో అక్తర్ మాట్లాడుతూ.. రిజ్వీ అసమర్థత వల్లే అక్మల్‌కు మూడేండ్ల నిషేధం పడిందని వ్యాఖ్యానించాడు. ఈ విషయంపై రిజ్వీ పిర్యాదు చేయడంతో అక్తర్‌కు సమన్లు జారీ చేశారు.