ఫిమేల్ బైకర్.. చెవిటివారి కోసం వరల్డ్ టూర్
దిశ, ఫీచర్స్ : డెఫ్ అయినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. వారు కూడా జీవితంలో ఎంతో సాధించొచ్చని అంటోంది బెంగళూరుకు చెందిన అర్చన తిమ్మరాజు. 40 % వినికిడి లోపంతో జన్మించిన అర్చన.. పెదాల కదలికల ద్వారా ఇంగ్లిష్ భాషను అర్థం చేసుకుంటోంది. అంతేకాదు శారీరక వైకల్యమున్న వారికి చేయూతనిచ్చేందుకు ‘నిశ్శబ్ధ యాత్ర(సైలెంట్ ఎక్స్‌పెడిషన్)’ పేరిట స్టార్టప్ ప్రారంభించి, వారి లక్ష్యసాధనకు సహకారమందిస్తోంది. ఈ క్రమంలో బైక్ టూర్ల ద్వారా అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతోంది. […]
దిశ, ఫీచర్స్ : డెఫ్ అయినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. వారు కూడా జీవితంలో ఎంతో సాధించొచ్చని అంటోంది బెంగళూరుకు చెందిన అర్చన తిమ్మరాజు. 40 % వినికిడి లోపంతో జన్మించిన అర్చన.. పెదాల కదలికల ద్వారా ఇంగ్లిష్ భాషను అర్థం చేసుకుంటోంది. అంతేకాదు శారీరక వైకల్యమున్న వారికి చేయూతనిచ్చేందుకు ‘నిశ్శబ్ధ యాత్ర(సైలెంట్ ఎక్స్‌పెడిషన్)’ పేరిట స్టార్టప్ ప్రారంభించి, వారి లక్ష్యసాధనకు సహకారమందిస్తోంది. ఈ క్రమంలో బైక్ టూర్ల ద్వారా అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతోంది.
ఈ నేపథ్యంలోనే తన బైక్‌పై 650 రోజుల పాటు 94 దేశాలు చుట్టుముట్టాలని నిర్ణయించుకున్న అర్చన.. ఈ టూర్ ద్వారా డెఫ్ కమ్యూనిటీకి భరోసా ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే బైక్ లైసెన్స్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందట. ఎట్టకేలకు లిప్ మూమెంట్‌ను బట్టి భాషను అర్థం చేసుకుంటానని ఆర్టీవో అధికారులను కన్విన్స్ చేసి లైసెన్స్ తీసుకుంది. శారీరక వైకల్యాలు మన లక్ష్య సాధనలో అసలు అడ్డంకులే కాదని, ధైర్యంగా ముందుకు సాగితేనే విజయం తప్పక వరిస్తుందని అంటోంది అర్చన.