యో..ఇదేందయ్య ఇది: కరోనా వాక్సిన్ కోసం తోపులాట (వీడియో)

దిశ, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలు వ్యాక్సిన్ కోసం బారులు తీరారు. సుమారు 150 మంది వివిధ గ్రామాల నుంచి మొదటి, రెండవ డోస్ కోసం ఆస్పత్రి చేరుకున్నారు. వీరికి వ్యాక్సినేషన్ సిబ్బంది క్రమ పద్ధతిలో ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ఆ తరువాత వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. దీన్ని పట్టించుకోకపోవడంతో ప్రజలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొవిడ్ నిబంధనలు తుంగలో తొక్కి గుంపులు గుంపులుగా ఒకరిపై ఒకరిని […]

Update: 2021-07-24 02:30 GMT

దిశ, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలు వ్యాక్సిన్ కోసం బారులు తీరారు. సుమారు 150 మంది వివిధ గ్రామాల నుంచి మొదటి, రెండవ డోస్ కోసం ఆస్పత్రి చేరుకున్నారు. వీరికి వ్యాక్సినేషన్ సిబ్బంది క్రమ పద్ధతిలో ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ఆ తరువాత వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. దీన్ని పట్టించుకోకపోవడంతో ప్రజలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొవిడ్ నిబంధనలు తుంగలో తొక్కి గుంపులు గుంపులుగా ఒకరిపై ఒకరిని తోసుకుంటూ గాయలపాలు అవుతున్నారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ కొరత వల్లే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, జిల్లా కలెక్టర్ స్పందించి సరిపడ వ్యాక్సినేషన్ ను అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News