కొత్తవి వద్దు.. తీసేసింది ఇప్పించండి సారూ!

దిశ ప్రతినిధి, ఖమ్మం : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం నిర్వహిస్తున్న అధికార పార్టీ నేతలకు గ్రాడ్యుయేట్లనుంచి అనేక చోట్ల నిరసన సెగ తగులుతోంది. తమను మోసం చేశారంటూ నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఉద్యోగం కోల్పోయిన వారు సైతం వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఇంకొందరేమో నేతల ఎదుట ప్రణమిల్లి.. కాళ్లు మొక్కుతూ తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. బుధవారం ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో ఓ యువతి ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి […]

Update: 2021-02-04 13:35 GMT

దిశ ప్రతినిధి, ఖమ్మం : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం నిర్వహిస్తున్న అధికార పార్టీ నేతలకు గ్రాడ్యుయేట్లనుంచి అనేక చోట్ల నిరసన సెగ తగులుతోంది. తమను మోసం చేశారంటూ నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఉద్యోగం కోల్పోయిన వారు సైతం వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఇంకొందరేమో నేతల ఎదుట ప్రణమిల్లి.. కాళ్లు మొక్కుతూ తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. బుధవారం ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో ఓ యువతి ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కాళ్ల మీద ప్రణమిల్లి కొంగుచాచి మరీ తమను ఆదుకోవాలని వేడుకోవడం సంచలమైంది.

వేడుకుంటూనే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన యువతి..

టీఆర్ఎస్ పార్టీ తరఫున బుధవారం ఏన్కూరు మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి కాళ్ల మీద ఓ యువతి ప్రణమిల్లి కొంగుచాచి మరీ తమను ఆదుకోవాలని వేడుకుంది. కాగా.. ఆ యువతి బోనకల్లు మండలానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ వై. కృష్ణవేణిగా తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం తమను ఉద్యోగం నుంచి తీసేసిందని.. ‘మా పొట్ట కొట్టొద్దూ.. మీ పాదాలు పట్టుకుంటా..’ అంటూ కృష్ణవేణి వేడుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు..

‘తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని అనుకున్నాం.. ఉన్న కొలువులు పోతాయనుకోలేదని.. మాకు పర్మినెంట్ ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు.. ఉన్న కొలువులను పునరుద్ధరణ’ చేయండంటూ వేడుకున్నదని చెబుతున్నారు. ‘‘ కేసీఆర్ బిడ్డకు కొలువు పోతే ఏడాది గడవక ముందే కొలువును ఇచ్చారు.. మా కొలువులు మాకివ్వండి.. కొంగు పట్టి అడుగుతున్నా.. మీ బిడ్డ లాంటిదాన్ని సారూ.. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని..’’ కృష్ణవేణి వాపోయినట్లు చెపుతున్నారు. అయితే, ఆమెకు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎలాంటి హామీ ఇచ్చారో మాత్రం స్పష్టంగా తెలియరాలేదు.

బయటకు రాకుండా అడ్డుకున్న నేతలు..?

సదరు యువతి వేడుకున్న విషయాన్ని ఏ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో రాకుండా ‘పెద్దలు’ అడ్డకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వంపై పోరుకు ఉద్యోగులు, నిరుద్యోగులు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో యువతి వేడుకున్న తీరు రాష్ట్రవ్యాప్తంగా పార్టీపై, వచ్చే అన్నిరకాల ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావించిన నేతలు అందరినీ ‘మేనేజ్’ చేసినట్లు ఆ పార్టీలోని ఓ వర్గంలో చర్చ జరుగుతోంది.. పార్టీలోని మరో వర్గం కావాలనే గురువారం యువతి ‘పల్లా’ కాళ్లమీద పడి ప్రణమిల్లే ఫొటో వివరాలు లేకుండా విడుదల చేసినట్లు పార్టీ వర్గాల్లోనే ప్రచారం. దీంతో ఆ చిత్రం నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ‘ఆ ఒక్కఫొటో చాలు ప్రభుత్వ పాలన ఏ తీరులో ఉందో చెప్పడానికి..’ అంటూ నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. అంతేకాదు కేసీఆర్ సర్కార్ ఉద్యోగులు, నిరుద్యోగులపై అవలంభిస్తున్న తీరుపై భగ్గు మంటున్నారు.

Tags:    

Similar News