షరతులు వర్తిస్తాయి: నేటి నుంచే తెలంగాణలో స్కూల్స్ ప్రారంభం

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో నేటి నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. 7నెలల తరువాత స్కూల్స్, కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా నిబంధనల్ని పాటిస్తూ స్కూల్స్ లో అన్నీ జాగ్రత్తలు తీసుకుంది. ప్రతీ స్కూల్లో ఐసోలేషన్ వార్డ్తో పాటు, వైద్యుల్ని సైతం అందుబాటులో ఉంచారు. ఒక్కో క్లాసులో 20మంది విద్యార్ధులు, ప్రత్యేక ప్రదేశాల్లో విద్యార్ధులు సౌకర్యంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇక తల్లిదండ్రుల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని లేఖను సంబంధిత స్కూల్స్ లేదంటే కాలేజీల్లో అందించాల్సి ఉంటుంది. […]

Update: 2021-01-31 21:43 GMT

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో నేటి నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. 7నెలల తరువాత స్కూల్స్, కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా నిబంధనల్ని పాటిస్తూ స్కూల్స్ లో అన్నీ జాగ్రత్తలు తీసుకుంది. ప్రతీ స్కూల్లో ఐసోలేషన్ వార్డ్తో పాటు, వైద్యుల్ని సైతం అందుబాటులో ఉంచారు. ఒక్కో క్లాసులో 20మంది విద్యార్ధులు, ప్రత్యేక ప్రదేశాల్లో విద్యార్ధులు సౌకర్యంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇక తల్లిదండ్రుల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని లేఖను సంబంధిత స్కూల్స్ లేదంటే కాలేజీల్లో అందించాల్సి ఉంటుంది. అలా ఎవరైతే విద్యార్ధులు లేఖ అందిస్తారో వారినే క్లాసులకు అనుమతించేలా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా తొమ్మిది,పదోతరగతితో పాటు ఇంటర్, డిగ్రీ, టెక్నికల్ కాలేజీల్లో, వైద్య కళాశాలలు, సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో క్లాసులు జరగనున్నాయి. వీటితో పాటు తెలంగాణలోని 970 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలలు కూడా నేటి నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి.

Tags:    

Similar News