ఓటీపీ తిప్పలు.. రేషన్ బియ్యం కోసం బాధలు

దిశ, పరిగి : కరోనా కష్టకాలంలో రేషన్ బియ్యానికి ఓటీపీ, ఐరిష్ లింకు చేయడం సరికాదని వికారాబాద్ జిల్లా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు జనగాం వెంకట్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం లాక్‌డౌన్, కరోనా కాలం ముగిసే వరకు రేషన్ బియ్యాన్ని మునుపటి మాదిరిగా కార్డు ద్వారా ఇవ్వాలని సూచించారు. చాలా మందికి సెల్ ఫోన్లు ఉన్నా ఓటీపీ చూసి చెప్పేందుకు రావడం లేదన్నారు. సెల్ ఫోన్లను రేషన్ డీలర్ ముట్టుకొని ఓటీపీ స్వయంగా తెలుసుకోవడం […]

Update: 2021-05-19 08:56 GMT

దిశ, పరిగి : కరోనా కష్టకాలంలో రేషన్ బియ్యానికి ఓటీపీ, ఐరిష్ లింకు చేయడం సరికాదని వికారాబాద్ జిల్లా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు జనగాం వెంకట్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం లాక్‌డౌన్, కరోనా కాలం ముగిసే వరకు రేషన్ బియ్యాన్ని మునుపటి మాదిరిగా కార్డు ద్వారా ఇవ్వాలని సూచించారు. చాలా మందికి సెల్ ఫోన్లు ఉన్నా ఓటీపీ చూసి చెప్పేందుకు రావడం లేదన్నారు. సెల్ ఫోన్లను రేషన్ డీలర్ ముట్టుకొని ఓటీపీ స్వయంగా తెలుసుకోవడం వల్ల కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందేందుకు ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రేషన్ కార్డు లబ్దిదారుడికి ఎలాంటి షరతులు లేకుండా బియ్యాన్ని పంపిణీ చేయాలని సూచించారు.

 

Tags:    

Similar News