తెలంగాణ కేబినెట్‌లో డేంజర్ బెల్స్.. ఈటల ఎఫెక్టేనా..!

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కేబినెట్​లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈటల వ్యవహారంతో కొంతమంది మంత్రుల్లో వణుకు పుడుతోంది. ఇప్పటి వరకు లేని విధంగా మంత్రి ఈటలపై భూ కబ్జాల ఆరోపణలు రావడం, వాటిపై సీఎం కేసీఆర్​ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించడం, గంటల వ్యవధిలోనే దానిపై అధికారులు తేల్చడం చకచకా జరిగిపోతున్నాయి. ఈ పరిణామాలు పలువురు మంత్రులకు గుచ్చుకుంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికే భూ కబ్జాలు, బెదిరింపుల ఆరోపణలు బహిరంగంగానే వెల్లడయ్యాయి. ఇదే సాకుతో ఎవరికి ఎసరు పెడుతారనే […]

Update: 2021-05-01 09:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కేబినెట్​లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈటల వ్యవహారంతో కొంతమంది మంత్రుల్లో వణుకు పుడుతోంది. ఇప్పటి వరకు లేని విధంగా మంత్రి ఈటలపై భూ కబ్జాల ఆరోపణలు రావడం, వాటిపై సీఎం కేసీఆర్​ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించడం, గంటల వ్యవధిలోనే దానిపై అధికారులు తేల్చడం చకచకా జరిగిపోతున్నాయి. ఈ పరిణామాలు పలువురు మంత్రులకు గుచ్చుకుంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికే భూ కబ్జాలు, బెదిరింపుల ఆరోపణలు బహిరంగంగానే వెల్లడయ్యాయి. ఇదే సాకుతో ఎవరికి ఎసరు పెడుతారనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్​ చేస్తే… ఒక్కరినే కాకుండా భూ దందాల ఆరోపణలున్న మంత్రులకు కూడా ఉద్వాసన ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు సీఎం కేసీఆర్​కు సన్నిహితంగా ఉండే ఓ ఎంపీ కూడా దీనిలో చక్రం తిప్పుతున్నారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రగతిభవన్​ వేదికగా జరుగుతున్న ఈ తతంగంలో సీఎం కేసీఆర్​, సదరు ఎంపీతో పాటు ఇద్దరు, ముగ్గురు ఉన్నతాధికారులే నివేదికలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇక భూ కబ్జాల ఆరోపణలు రాష్ట్ర మంత్రులకే కొత్తేం కాదు. ఇటీవల జీహెచ్​ఎంసీ పరిధిని ఆనుకుని ఉండే ఓ మంత్రిపై బహిరంగంగా విమర్శలు వచ్చాయి. ఆడియో రికార్డులు బయటకు వచ్చాయి. మరో మంత్రి కూడా భూవివాదాల్లో ఇరుక్కున్నారు. ఇక రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా మంత్రివర్గంలోకి తీసుకున్న మరొకరిపై కూడా ఆరోపణలున్నాయి. మంత్రి కేటీఆర్​ వర్గం అంటూ చెప్పుకుంటూ భూ కబ్జాల్లో తలదూర్చారని అంతేకాకుండా పలు భూముల్లో మంత్రి కేటీఆర్​, తాను భాగస్వాములమంటూ కొన్నిచోట్ల చెప్పుకుంటున్నట్లు ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించాయి. సదరు మంత్రి తమ్ముడి చేతుల మీదుగా భూ వ్యవహారాలు నడిపిస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి.
ఇలాంటి పరిణామాల్లో కేవలం భూ కబ్జా… అసైన్డ్​ భూమిని కబ్జా చేశారనే ఆరోపణలతో మంత్రి ఈటలపై విచారణ మొదలైంది. కానీ కొంతమంది మంత్రులు పదుల సంఖ్యలో ఎకరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని, కొన్నిచోట్ల బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీంతో కేబినెట్​లో మార్పులు ఉంటాయా… ఉంటే ఎవరి కుర్చీకి ఎసరు ఉంటుందనే భయంలో ఉంటున్నారు

Tags:    

Similar News