ప్రేమ కోసం ఒకరు ఆత్మహత్య.. మరొకరు హత్య
దిశ, వెబ్‌డెస్క్: ప్రియుడు దక్కడన్న బాధతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంటే.. తన కూతురి చావుకు కారణం ప్రియుడే అని భావించిన తండ్రి అతడిని హత్య చేశాడు. ఇద్దరు కలిసి జీవించాలనుకుంటే వేరు చేసిన తల్లిదండ్రులు.. అదే ఇద్దరు తమకుదూరమయ్యారని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రేమ కోసం ఒకరు బలైతే.. అదే తరుణంలో మరొకరు హత్యకు గురైన ఘటన కర్ణాటకలో సంచలనం రేపింది. కర్ణాటకలోని బాగేపల్లి సమీపంలోని యగవమద్దలఖానలో ఈ దారుణం వెలుగు చూసింది. ఇదే గ్రామానికి చెందిన […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రియుడు దక్కడన్న బాధతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంటే.. తన కూతురి చావుకు కారణం ప్రియుడే అని భావించిన తండ్రి అతడిని హత్య చేశాడు. ఇద్దరు కలిసి జీవించాలనుకుంటే వేరు చేసిన తల్లిదండ్రులు.. అదే ఇద్దరు తమకుదూరమయ్యారని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రేమ కోసం ఒకరు బలైతే.. అదే తరుణంలో మరొకరు హత్యకు గురైన ఘటన కర్ణాటకలో సంచలనం రేపింది.
కర్ణాటకలోని బాగేపల్లి సమీపంలోని యగవమద్దలఖానలో ఈ దారుణం వెలుగు చూసింది. ఇదే గ్రామానికి చెందిన హరీష్, స్థానికంగా ఉండే వెంకటేశ్ కూతురు ప్రేమించుకుంటున్నారు. అయితే, కొన్నాళ్లుగా ప్రేమ లోకంలో విహరిస్తున్న వీరికి పెద్దలు అడ్డుతగిలారు. దీంతో పెండ్లి చేసుకుందామని అనుకున్న విషయం కాస్తా ఇంట్లో తెలియడంతో ఒక్కసారిగా వారి కుటుంబాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ప్రియుడితో కలిసి ఉండలేనని భావించిన ప్రియురాలు కఠిన నిర్ణయమే తీసుకుంది. ఇంట్లో వాళ్ల మాట కాదనలేక.. ప్రియుడితో ఉండేలేనన్న బాధతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో బాధిత కుటుంబం బోరున విలపించగా.. ఆమె తండ్రి మాత్రం ఆగ్రహంతో ఊగిపోయాడు. తన కూతురి చావుకు హారీష్ కారణమని భావించిన వెంకటేశ్ కత్తితో అతడిని పొడిచి హత్య చేశాడు. ఈ హత్యతో ప్రశాంతంగా ఉణ్న ఆ రెండు కుటుంబాల మధ్య పగ మొదలైంది.