కలెక్టరేట్‌లో తండ్రీకొడుకుల ఆత్మహత్యాయత్నం

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: రెవెన్యూ అధికారులు అనుసరిస్తున్న విధానాలతో విసుగెత్తిన ఆ తండ్రీకొడుకులు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. ఈ ఘటన సోమవారం నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు(తండ్రీకొడుకులు) తమ భూ సమస్యను పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఎంత తిరిగినా పని జరుగక పోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన తండ్రీకొడుకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట పురుగులమందు […]

Update: 2020-08-31 05:12 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: రెవెన్యూ అధికారులు అనుసరిస్తున్న విధానాలతో విసుగెత్తిన ఆ తండ్రీకొడుకులు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. ఈ ఘటన సోమవారం నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు(తండ్రీకొడుకులు) తమ భూ సమస్యను పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

ఎంత తిరిగినా పని జరుగక పోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన తండ్రీకొడుకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన సిబ్బంది వెంటనే వారిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. తండ్రి పరిస్థితి మెరుగ్గా ఉండగా, కొడుకు రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News