ప్లీనరీలో అయ్యా కొడుకులేనా.. ఉద్యమకారులు, హరీశ్ రావు ఎక్కడ ?: రేవంత్

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్లీనరీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో బాసటగా నిలిచిన ఉద్యమకారులు, మంత్రి హరీష్ రావు ఎక్కడా అని ప్రశ్నించారు. ‘‘టీఆర్ఎస్‌కు ఏ దిక్కు లేనప్పుడు కొండా లక్ష్మణ్​బాపూజీ తన నివాసాన్ని టీఆర్ఎస్ కార్యాలయానికి ఇచ్చారు. ఇప్పుడు వేల కోట్లు, వందల ఎకరాల భూములు సంపాదించుకున్నారని, కానీ ఇప్పుడు ప్లీనరీలో కొండా లక్ష్మణ్​బాపూజీని స్మరించుకోలేదని ఆవేదన […]

Update: 2021-10-25 08:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్లీనరీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో బాసటగా నిలిచిన ఉద్యమకారులు, మంత్రి హరీష్ రావు ఎక్కడా అని ప్రశ్నించారు. ‘‘టీఆర్ఎస్‌కు ఏ దిక్కు లేనప్పుడు కొండా లక్ష్మణ్​బాపూజీ తన నివాసాన్ని టీఆర్ఎస్ కార్యాలయానికి ఇచ్చారు. ఇప్పుడు వేల కోట్లు, వందల ఎకరాల భూములు సంపాదించుకున్నారని, కానీ ఇప్పుడు ప్లీనరీలో కొండా లక్ష్మణ్​బాపూజీని స్మరించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అన్యాయాన్ని, వెనకబాటుతనాన్ని వివరించిన జయశంకర్​సారును గుర్తు చేసుకోలేదని, నీళ్ల నిపుణుడు విద్యాసాగర్​రావును కూడా గుర్తు లేడన్నారు. కేశవరావు జాదవ్, గూడ అంజయ్య, కేసీఆర్‌కు డీజిల్​కొట్టించిన కళ్లెం యాదగిరిరెడ్డిని, కాపలా ఉండే సుదర్శన్, రెహమాన్​పేర్లను కూడా ప్రస్తావించలేదన్నారు. తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన వారిని ఎందుకు గుర్తు చేసుకోలేదని’’ టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ప్రశ్నించారు.

టీఆర్ఎస్​ప్లీనరీలో రేగులపాటి పాపారావు, గాదె ఇన్నయ్య, రావుల రవీంద్రనాథ్​రెడ్డి, చెరుకు సుధాకర్, స్వామిగౌడ్, విజయరామారావు, వికారాబాద్​ చంద్రశేఖర్​రావు, పాశం యాదగిరి, రవీంద్రనాయక్, విజయశాంతి, దేశిని చిన్నమల్లయ్య వంటి వారిని కూడా కేసీఆర్​మరిచిపోయారన్నారు. వారంతా టీఆర్ఎస్ నిర్మాణంలో, ఎదుగుదలలో కీలకంగా ఉన్నారని, వారి భుజాలపై ఎక్కి కేసీఆర్​ఇప్పుడు పదవిలోకి వచ్చాడన్నారు. వీరంతా కేసీఆర్ చేతిలో మోసానికి గురయ్యారన్నారు.

ప్లీనరీలో తండ్రీ, కొడుకుల ఫొటోలు పెట్టుకున్నారని, కనీసం హరీశ్​రావు ఫొటో కూడా పెట్టలేదన్నారు. ఉద్యమంలో వెన్నంటి నిలిచిన ఈటల రాజేందర్‌ను బయటకు పంపించారని, ఆయన్ను ఓడించేందుకు హరీశ్​రావును అక్కడకు పంపించారని, కనీసం ప్లీనరీకి కూడా రావాలని హరీశ్​రావుకు చెప్పలేదన్నారు. ఇంత హీనమైన బతుకు ఎందుకని హరీశ్​రావుకు సూచించారు.

Tags:    

Similar News