హత్య కేసులో తండ్రి కొడుకులు అరెస్ట్

దిశ, చార్మినార్: ఇంజన్ ఆయిల్ వ్యాపారి హత్య కేసు మిస్టరీని కాలా పత్తర్ పోలీసులు ఛేదించారు. వ్యాపారిని హత్య చేసిన తండ్రీకొడుకులను కాలా పత్తర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కాలా పత్తర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … పాతబస్తీ చున్నీకి బట్టి ప్రాంతానికి చెందిన సయ్యద్ ముకరం అలీ(44) ఇంజన్ ఆయిల్ వ్యాపారం చేస్తుంటాడు. మిశ్రీగంజ్ కు చెందిన మహ్మద్ హమీద్ ఖాన్ (60) ఎలక్ట్రిషియన్. అతని కుమారుడు మహ్మద్ ఆర్బాజ్ […]

Update: 2021-07-11 10:28 GMT

దిశ, చార్మినార్: ఇంజన్ ఆయిల్ వ్యాపారి హత్య కేసు మిస్టరీని కాలా పత్తర్ పోలీసులు ఛేదించారు. వ్యాపారిని హత్య చేసిన తండ్రీకొడుకులను కాలా పత్తర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కాలా పత్తర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … పాతబస్తీ చున్నీకి బట్టి ప్రాంతానికి చెందిన సయ్యద్ ముకరం అలీ(44) ఇంజన్ ఆయిల్ వ్యాపారం చేస్తుంటాడు. మిశ్రీగంజ్ కు చెందిన మహ్మద్ హమీద్ ఖాన్ (60) ఎలక్ట్రిషియన్. అతని కుమారుడు మహ్మద్ ఆర్బాజ్ (20) విద్యార్థి. ఆర్బాజ్ 2017 లో ముకరం అలీ కూతురిని వేదించాడు. దీంతో ఆమె తండ్రి ముకరం ఆలీకి జరిగిన విషయాన్ని చెప్పింది. ముకరం అలీ ఆర్బాజ్ ను కిడ్నాప్ చేసి బట్టలు ఊడదీసి మరి కొట్టాడు.

దీంతో ఇరువర్గాల ఫిర్యాదులపై కౌంటర్ కేసులు నమోదయ్యాయి. అయితే ముకరం అలీ కిడ్నాప్ కేసు రాజీ చేసుకుందామని ఆర్బాజ్ వెంటపడి వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆర్బాజ్ తన తండ్రి మహ్మద్ హమీద్ ఖాన్ కు చెప్పాడు. తండ్రీ కొడుకులు కలిసి ముకరం అలీని ఎలాగైనా మట్టుబెట్టడానికి అదను కోసం ఎదురుచూస్తున్నారు. జులై 8 వతేదీన చున్నీకి బట్టి ప్రాంతంలో ఉన్న ముకరం ఆలీపై తండ్రీ కొడుకులు గొడవకు దిగారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ముకరం అలీపై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ముకరం అలీ మృతి చెందడంతో అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి కొడుకులు మహ్మద్ హమీద్ ఖాన్, ఆర్బాజ్ లను అదువులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

Tags:    

Similar News