మా భూముల జోలికి రావొద్దు… ప్ర‌భుత్వానికి ఆరెప‌ల్లి రైతుల అల్టిమేటం

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: భూముల‌ను బ‌ల‌వంతంగా లాక్కునే ప్ర‌య‌త్నాల‌ను విర‌మించుకోవాల‌ని వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణ శివారు, 3 డివిజ‌న్‌లోని ఐదు గ్రామాల ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. కాక‌తీయ ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ ల్యాండ్ పూలింగ్‌ను వ్య‌తిరేకిస్తూ ఏనుమాముల‌, కొత్త‌పేట‌, ఆరెప‌ల్లి, పైడిప‌ల్లి, మొగిలిచ‌ర్ల గ్రామాల రైతులు గ‌త ఐదు రోజులుగా నిర‌స‌న‌ల‌కు దిగుతున్న విష‌యం తెలిసిందే. త‌మ భూముల జోలికి రావొద్దంటూ సోమ‌వారం గ్రీవెన్స్‌లోనూ వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ క‌లెక్ట‌ర్ల‌కు విన‌తిప‌త్రాలు అంద‌జేశారు. మంగ‌ళ‌వారం నుంచి మ‌రింత‌గా ఉద్య‌మాన్ని ఉధృతం చేస్తామ‌ని […]

Update: 2021-08-23 21:42 GMT

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: భూముల‌ను బ‌ల‌వంతంగా లాక్కునే ప్ర‌య‌త్నాల‌ను విర‌మించుకోవాల‌ని వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణ శివారు, 3 డివిజ‌న్‌లోని ఐదు గ్రామాల ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. కాక‌తీయ ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ ల్యాండ్ పూలింగ్‌ను వ్య‌తిరేకిస్తూ ఏనుమాముల‌, కొత్త‌పేట‌, ఆరెప‌ల్లి, పైడిప‌ల్లి, మొగిలిచ‌ర్ల గ్రామాల రైతులు గ‌త ఐదు రోజులుగా నిర‌స‌న‌ల‌కు దిగుతున్న విష‌యం తెలిసిందే. త‌మ భూముల జోలికి రావొద్దంటూ సోమ‌వారం గ్రీవెన్స్‌లోనూ వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ క‌లెక్ట‌ర్ల‌కు విన‌తిప‌త్రాలు అంద‌జేశారు.

మంగ‌ళ‌వారం నుంచి మ‌రింత‌గా ఉద్య‌మాన్ని ఉధృతం చేస్తామ‌ని రైతులు చెబుతున్నారు. ప్ర‌భుత్వ వైఖ‌రిపై రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. త‌మ పొట్టకొట్టేందుకు య‌త్నిస్తే మాత్రం ఆత్మ‌హ‌త్య‌లైనా చేసుకుంటామ‌ని, కానీ భూములు మాత్రం ఇవ్వ‌బోమ‌ని చెబుతున్నారు.

Tags:    

Similar News