అగ్రికల్చర్ ఆఫీసర్లకు రైతుల అల్టిమేటం.. మాకు నచ్చిందే వేస్తాం.. ఏం చేస్తరు?

దిశ, జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో వ్యవసాయ అధికారులకు మంగళవారం అన్నదాతలు షాక్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంట వేయొద్దని స్పష్టం చేయడంతో అందుకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించడానికి గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో గ్రామ రైతులందరూ ఒక్కసారిగా కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అధికారులను అడ్డుకొని వరి పంటలు వేస్తామని రైతులు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ […]

Update: 2021-11-30 06:43 GMT

దిశ, జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో వ్యవసాయ అధికారులకు మంగళవారం అన్నదాతలు షాక్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంట వేయొద్దని స్పష్టం చేయడంతో అందుకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించడానికి గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో గ్రామ రైతులందరూ ఒక్కసారిగా కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అధికారులను అడ్డుకొని వరి పంటలు వేస్తామని రైతులు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News