రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర టాప్..
దిశ,వెబ్‌డెస్క్ : దేశంలో రైతుల ఆత్మహత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తాజా గణాంకాలను వెల్లడించింది. దీని ప్రకారం.. 18వేలకు పైగా మంది రైతుల ఆత్మహత్యలతో మహారాష్ట్ర తొలిస్థానంలో నిలవగా.. 13వేలకు పైగా ఆత్మహత్యలతో తమిళనాడు రెండోస్థానంలో నిలిచింది. 12వేలకుపైగా రైతుల సూసైడ్‌లతో పశ్చిమబెంగాల్ మూడో స్థానంలో కొనసాగుతోంది. 2019 సంవత్సరంలో తెలంగాణలో 7,675 మంది ఆత్మహత్యలు చేసుకోగా, వీరిలో ఎక్కువగా 2,858 మంది కూలీలే ఉన్నారు. ఇదే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌లోనూ రైతు ఆత్మహత్యలు పెరిగాయి. అక్కడ […]
దిశ,వెబ్‌డెస్క్ :
దేశంలో రైతుల ఆత్మహత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తాజా గణాంకాలను వెల్లడించింది. దీని ప్రకారం.. 18వేలకు పైగా మంది రైతుల ఆత్మహత్యలతో మహారాష్ట్ర తొలిస్థానంలో నిలవగా.. 13వేలకు పైగా ఆత్మహత్యలతో తమిళనాడు రెండోస్థానంలో నిలిచింది. 12వేలకుపైగా రైతుల సూసైడ్‌లతో పశ్చిమబెంగాల్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
2019 సంవత్సరంలో తెలంగాణలో 7,675 మంది ఆత్మహత్యలు చేసుకోగా, వీరిలో ఎక్కువగా 2,858 మంది కూలీలే ఉన్నారు. ఇదే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌లోనూ రైతు ఆత్మహత్యలు పెరిగాయి. అక్కడ పలు కారణాలతో 6,465మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో రిపోర్టులో పేర్కొన్నది.