రెండూర్ల మధ్య యూరియా పంచాయితీ..

దిశ , నిజామాబాద్: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. బుధవారం కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిపై రోడ్డుకు అడ్డంగా చెట్లు పెట్టి నిరసనకు దిగారు. తాడ్వాయి సోసైటికి వచ్చిన యూరియా బస్తాల లోడ్‌ను అధికారులు ఎర్రపహాడ్ గ్రామానికి తరలించడంతో రైతులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. ఉదయం నుంచి యూరియా కోసం ఎదురుచూస్తున్న తాము ఏమైనా పిచ్చోళ్ళమా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. తాము ధర్నాకు దిగితే లోడ్ […]

Update: 2020-07-15 06:32 GMT

దిశ , నిజామాబాద్: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. బుధవారం కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిపై రోడ్డుకు అడ్డంగా చెట్లు పెట్టి నిరసనకు దిగారు. తాడ్వాయి సోసైటికి వచ్చిన యూరియా బస్తాల లోడ్‌ను అధికారులు ఎర్రపహాడ్ గ్రామానికి తరలించడంతో రైతులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు.

ఉదయం నుంచి యూరియా కోసం ఎదురుచూస్తున్న తాము ఏమైనా పిచ్చోళ్ళమా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. తాము ధర్నాకు దిగితే లోడ్ తిరిగి వస్తుందని అధికారులు చెబుతున్నారని, ఒకవేళ నిరసనకు చేపట్టకపోతే యూరియా ఎటు పోయేదని ప్రశ్నించారు. అవసరం ఉన్న చోట మాత్రం యూరియా కొరత సృష్టింస్తున్నారని, అవసరం లేనిచోట యూరియాను నిల్వ చేస్తున్నారని రైతులు ఆరోపించారు. బంగారు తెలంగాణలో రైతుల పరిస్థితి ఇక మారదా అని మండిపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రైతులకు సర్ది చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.

Tags:    

Similar News