MRO ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత.. మహిళా తహసీల్దార్‌ను అడ్డుకున్న రైతులు

దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అసైన్డ్ భూములుగా మార్చిన అధికారులపై చర్యలు తీసుకొని తమ భూములు వారి పేరు మీదకు రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ఆఫీసుకు వచ్చిన తహసీల్దార్ స్వప్న తో సహా ఇతర సిబ్బందిని రైతులు అడ్డుకున్నారు. ఆరుబయట చెట్టు కింద కూర్చోబెట్టి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో […]

Update: 2021-08-26 00:07 GMT

దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అసైన్డ్ భూములుగా మార్చిన అధికారులపై చర్యలు తీసుకొని తమ భూములు వారి పేరు మీదకు రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం ధర్నాకు దిగారు.

ఈ క్రమంలో ఆఫీసుకు వచ్చిన తహసీల్దార్ స్వప్న తో సహా ఇతర సిబ్బందిని రైతులు అడ్డుకున్నారు. ఆరుబయట చెట్టు కింద కూర్చోబెట్టి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను తొలగించేందుకు ప్రయత్నించినప్పటికీ రైతులు ససేమిరా అన్నారు.

Tags:    

Similar News