ఫార్మా సిటీకి భూములివ్వం : రైతులు
దిశ, ఇబ్రహీంపట్నం: పంటలు పండే ప్రాంతంలో విషతుల్యమైన ఔషధ నగరిని ఏర్పాటు చేయొద్దని అన్నదాతలు రోడ్డెక్కారు. ఆదివారం యాచారం మండలం నానక్ నగర్‌లో రైతులు, గ్రామస్థులు నిరాహారదీక్ష చేపట్టారు. ప్రాణాలు పోయినా ఫార్మా సిటీకి భూములిచ్చేది లేదంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. తమ భూములు లాక్కుంటే తాము బతికేదెలా? అని ప్రశ్నించారు. బలవంతపు భూసేకరణ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కొందరు వ్యవసాయం, కూలీలుగా ఇంకొందరు, అటవీ సంపదను నమ్ముకుని మరికొందరు జీవనం సాగిస్తున్నారన్నారు. పట్టా భూముల్ని సైతం […]
దిశ, ఇబ్రహీంపట్నం: పంటలు పండే ప్రాంతంలో విషతుల్యమైన ఔషధ నగరిని ఏర్పాటు చేయొద్దని అన్నదాతలు రోడ్డెక్కారు. ఆదివారం యాచారం మండలం నానక్ నగర్‌లో రైతులు, గ్రామస్థులు నిరాహారదీక్ష చేపట్టారు. ప్రాణాలు పోయినా ఫార్మా సిటీకి భూములిచ్చేది లేదంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. తమ భూములు లాక్కుంటే తాము బతికేదెలా? అని ప్రశ్నించారు. బలవంతపు భూసేకరణ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కొందరు వ్యవసాయం, కూలీలుగా ఇంకొందరు, అటవీ సంపదను నమ్ముకుని మరికొందరు జీవనం సాగిస్తున్నారన్నారు. పట్టా భూముల్ని సైతం బలవంతంగా భూ సేకరణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషాన్ని వెదజల్లే కంపెనీలను ఉపసంహరించుకొని స్థానిక యువతకు ఉపాధినందించే సంస్థలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.