రైతులు ధాన్యంతోపాటు తాడిపత్రి తెచ్చుకోవాలి: కలెక్టర్
దిశ, మెదక్: రైతులు తమ ధాన్యం వెంట తాడిపత్రి, టార్పాలిన్లు విధిగా ఎవరికివారు తెచ్చుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సోమవారం వ్యవసాయ, సహకార, సివిల్ సప్లై , ఐకేపీ తదితర అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 93 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 41, ఐకేపీ ఆధ్వర్యంలో 52 కేంద్రాలు ప్రారంభమైనట్లు తెలిపారు. వరి కోతలు ఊపందుకున్న […]
దిశ, మెదక్: రైతులు తమ ధాన్యం వెంట తాడిపత్రి, టార్పాలిన్లు విధిగా ఎవరికివారు తెచ్చుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సోమవారం వ్యవసాయ, సహకార, సివిల్ సప్లై , ఐకేపీ తదితర అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 93 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 41, ఐకేపీ ఆధ్వర్యంలో 52 కేంద్రాలు ప్రారంభమైనట్లు తెలిపారు. వరి కోతలు ఊపందుకున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు వీలుగా ముందస్తుగా టోకెన్లు జారీచేసి నియంత్రిత పద్ధతిలో కొనుగోలు చేయాలన్నారు. రైతులు ఏ రోజు ధాన్యాన్ని తీసుకురావాలో టోకెన్లు జారీ చేయాలని సూచించారు.
tag: collector hanumantha rao, Farmers must bring Tarpaulin along with the grain