రిజర్వాయర్ పూర్తై దశాబ్దం గడుస్తున్నా..

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: సంగంబండ ఎడమ కాల్వ ద్వారా రైతులకు సాగునీరు విడుదల చేయాలని అఖిలపక్షం నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం నారాయణపేట జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి అదనపు కలెక్టర్ చంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కొండన్న మాట్లాడుతూ… రిజర్వాయర్ పూర్తి అయి దశాబ్దం గడుస్తున్నా.. కుడి కాలువ రైతులకు నీరు విడుదల చేస్తున్నారే తప్పా, ఎడమ కాల్వకు మాత్రం విడుదల చేయడం లేదని ఆరోపించారు. అధికారులు నిర్లక్ష్యంతో […]

Update: 2020-08-17 06:48 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: సంగంబండ ఎడమ కాల్వ ద్వారా రైతులకు సాగునీరు విడుదల చేయాలని అఖిలపక్షం నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం నారాయణపేట జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి అదనపు కలెక్టర్ చంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కొండన్న మాట్లాడుతూ…

రిజర్వాయర్ పూర్తి అయి దశాబ్దం గడుస్తున్నా.. కుడి కాలువ రైతులకు నీరు విడుదల చేస్తున్నారే తప్పా, ఎడమ కాల్వకు మాత్రం విడుదల చేయడం లేదని ఆరోపించారు. అధికారులు నిర్లక్ష్యంతో మక్తల్, మగనూరు మండలంలోని 9 గ్రామాల రైతుల భూములు బీళ్లుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందిస్తే ఈ మండలాల్లోని సుమారు 20వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతుల వలసలు నివారించే అవకాశం ఉంటుందన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..