రోడ్డు ఎక్కిన రైతన్నలు..
దిశ, సిద్దిపేట: గత 20రోజులుగా కొనుగోలు కేంద్రాలలో పడి గాపులు కాసిన వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూర్, తోర్ణాల గ్రామాల లోని రైతులు తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. గంట కు పైగా రోడ్ పై రైతులు రాస్తారోకో చేపట్టడంతో రోడ్ పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు, స్థానిక […]
దిశ, సిద్దిపేట: గత 20రోజులుగా కొనుగోలు కేంద్రాలలో పడి గాపులు కాసిన వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూర్, తోర్ణాల గ్రామాల లోని రైతులు తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. గంట కు పైగా రోడ్ పై రైతులు రాస్తారోకో చేపట్టడంతో రోడ్ పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు, స్థానిక ప్రజా ప్రతినిధిలు సంఘటన స్థలానికి చేరుకుని రైతులు నచ్చజెప్పి ఆందోళన విరమింప చేశారు.
ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ… గత 20రోజుల కిందట ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చి పడి గాపులు కాసిన ధాన్యం కొనడం లేదంటూ మండి పడ్డారు. ధాన్యాన్ని పూర్తిగా ఎండబెట్టిన కూడా కొనడం లేదని, గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసిపోయి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కొనుగోలు జరిపిన ధాన్యాన్ని కూడా మిల్లర్లు ట్రాక్టర్ లోడ్ కు ఆరు సంచుల వరకు తూకం తగ్గిస్తున్నారు అని మండి పడ్డారు. వర్షాకాలం ప్రారంభమైన కూడా సగం ధాన్యం కూడా కొనలేదని అన్నారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, మిల్లర్లు హమాలీలు కుమ్మక్కై రైతులకు న్యాయం చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఎటువంటి కటింగ్ లేకుండా వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని , లారీలు, గన్ని బ్యాగ్ లు కొరత లేకుండా చూడాలని అధికారులను కోరారు.