మాకు నష్టం జరిగింది.. అధికారులే కారణమంటూ రైతుల ఆందోళన
దిశ, రామారెడ్డి: ఆరుగాలం శ్రమించి, పండించిన పంట అమ్ముకునే సమయంలో అకాల వర్షం రైతులను ఆగమాగం చేసింది. వరి ధాన్యం కళ్లాల్లో కొంతమంది ఆరబెట్టుకోగా, మరికొందరు ధాన్యం బస్తాల్లో నింపారు. నింపిన ధాన్యం రైస్ మిల్లులకు వెంటవెంటనే తరలిస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. అధికారులు, రైస్ మిల్లర్ల నిర్లక్ష్యంతో నింపిన ధాన్యం బస్తాలు కళ్ళాల్లోనే ఉండడంతో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి. ముఖ్యంగా రామారెడ్డి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో […]
దిశ, రామారెడ్డి: ఆరుగాలం శ్రమించి, పండించిన పంట అమ్ముకునే సమయంలో అకాల వర్షం రైతులను ఆగమాగం చేసింది. వరి ధాన్యం కళ్లాల్లో కొంతమంది ఆరబెట్టుకోగా, మరికొందరు ధాన్యం బస్తాల్లో నింపారు. నింపిన ధాన్యం రైస్ మిల్లులకు వెంటవెంటనే తరలిస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. అధికారులు, రైస్ మిల్లర్ల నిర్లక్ష్యంతో నింపిన ధాన్యం బస్తాలు కళ్ళాల్లోనే ఉండడంతో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి.
ముఖ్యంగా రామారెడ్డి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఉన్న కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం కుప్పలు, ధాన్యం బస్తాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో నీరు నిలవడంతో ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తడిసి పోవడానికి అధికారులే కారణమని రైతులు ఆరోపించారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని తరలించడంతో పాటు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.