తలపై రాయితో బాదుకుని రైతు ఆత్మహత్యాయత్నం..

దిశ, వెబ్‌డెస్క్ : దేశానికి వెన్నెముకగా కీర్తించబడుతున్న రైతు పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా తయారవుతోంది. అటు ప్రభుత్వాలతో పాటు, ఇటు రాజకీయ నాయకుల చేతిలో రైతులు ఇంకా దగా పడుతూనే ఉన్నారు. తాజాగా ఓ నాయకుడు చేసిన పనికి, తన బాధను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక బండ రాయితో తనకు తానే తలపై కొట్టుకుని రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం […]

Update: 2020-11-13 09:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశానికి వెన్నెముకగా కీర్తించబడుతున్న రైతు పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా తయారవుతోంది. అటు ప్రభుత్వాలతో పాటు, ఇటు రాజకీయ నాయకుల చేతిలో రైతులు ఇంకా దగా పడుతూనే ఉన్నారు. తాజాగా ఓ నాయకుడు చేసిన పనికి, తన బాధను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక బండ రాయితో తనకు తానే తలపై కొట్టుకుని రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తమ్మడపల్లిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకివెళితే.. రైతుకు చెందిన 9ఎకరాల పొలాన్ని వైసీపీ నేత దుగ్గెంపూడి వెంకటరెడ్డి ఆక్రమించాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు.పోలీసులు కూడా పట్టిపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఆ రైతు బండరాయితో తనంతట తానే తలపై బాదుకుని చనిపోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Tags:    

Similar News