కరోనాపై ఓ రైతు వినూత్న ప్రచారం
దిశ, మెదక్: కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ రైతు వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. గన్నేరువరం మండలం చీమలకుంటపల్లికి చెందిన బమండ్ల రవీందర్.. మార్చి 26న తన బైక్‌కు రెండు మైకులు అమర్చుకుని ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. దాదాపు 21 రోజుల్లో 2,100 కిలోమీటర్లు ప్రయాణించి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లోని 200 గ్రామాల్లో ప్రచారం చేశాడు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో.. పాటల రూపంలో కరోనా వైరస్ పట్ల […]
దిశ, మెదక్: కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ రైతు వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. గన్నేరువరం మండలం చీమలకుంటపల్లికి చెందిన బమండ్ల రవీందర్.. మార్చి 26న తన బైక్‌కు రెండు మైకులు అమర్చుకుని ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. దాదాపు 21 రోజుల్లో 2,100 కిలోమీటర్లు ప్రయాణించి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లోని 200 గ్రామాల్లో ప్రచారం చేశాడు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో.. పాటల రూపంలో కరోనా వైరస్ పట్ల ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశాడు. అయితే, ఇదంతా తన సొంత ఖర్చుతోనే చేస్తున్నట్లు సదరు రైతు వెల్లడించాడు.
Tags: farmer, corona Campaign, siddipet