పోలీస్ స్టేషన్‌లో రైతు ఆత్మహత్యాయత్నం కలకలం

దిశ, పాలకుర్తి: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ పోలీస్ స్టేషన్‌లో రైతు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంధువుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హరిపిరాల గ్రామ శివారు భీముడు తండాకు చెందిన జాటోతు సోమ్ల, గోపాల్‌కు తండ్రి సంపాదించిన రెండు ఎకరాల ఇరువై గుంటల భూమి విషయంలో రెండున్నర ఏళ్ళుగా గొడవ నడుస్తుంది. 147, 148 సర్వేనంబర్ భూమి విషయంలో కోర్టులో కేసు నడుస్తుంది. భూమి విషయంలో గోపాల్ పోలీస్ స్టేషన్‌లో సోమ్లపై ఫిర్యాదు […]

Update: 2021-07-20 08:49 GMT

దిశ, పాలకుర్తి: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ పోలీస్ స్టేషన్‌లో రైతు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంధువుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హరిపిరాల గ్రామ శివారు భీముడు తండాకు చెందిన జాటోతు సోమ్ల, గోపాల్‌కు తండ్రి సంపాదించిన రెండు ఎకరాల ఇరువై గుంటల భూమి విషయంలో రెండున్నర ఏళ్ళుగా గొడవ నడుస్తుంది. 147, 148 సర్వేనంబర్ భూమి విషయంలో కోర్టులో కేసు నడుస్తుంది. భూమి విషయంలో గోపాల్ పోలీస్ స్టేషన్‌లో సోమ్లపై ఫిర్యాదు చేశాడు.

తర్వాత సోమ్ల గోపాల్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఏఎస్ఐ మున్నీర్ ఊల్లా సోమ్లను 25 రోజులుగా ఉదయం పిలిచి సాయంత్రం పంపిస్తున్నారు. దీంతో విసిగిపోయిన సోమ్ల మంగళవారం పోలీస్ స్టేషన్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు పోలీస్ వాహానంలో పట్టణంలోని సాయి మల్టీ స్పెపాలిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సోమ్ల పరిస్థితి విషమంగా ఉందని బంధువు వెంకన్న తెలిపారు. సోమ్లకు ఈ పరిస్థితి రావాడానికి ఏఎస్ఐ మునీరు ఊల్లా ప్రధాన కారణమని వెంకన్న ఆరోపించారు. గోపాల్ ఇచ్చిన ఫిర్యాదుకు సోమ్లను 25 రోజులుగా స్టేషన్‌కు పిలిచాడు. సోమ్ల ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోలేదని అన్న కొడుకు వెంకన్న ఆవేదన వ్వక్తం చేశారు.

Tags:    

Similar News