కొడుకు కోసం.. ఇండియన్ ఐడల్‌ను వీడిన సింగర్

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఫర్మానీ నాజ్‌.. చిన్నప్పటి నుంచే ‘సింగర్’గా రాణించాలని కలలు కన్నది. అయితే ఫర్మానీ ప్రతిభ ప్రపంచానికి తెలిసేలోపే తనకు పెళ్లి కాగా, ఆ తర్వాత కొడుకు కూడా పుట్టాడు. కానీ ఆ బాలునికి పుట్టినప్పటి నుంచే గొంతు సమస్య ఉండటంతో మాట్లాడలేకపోయేవాడు. దీంతో ఓ వైపు కుమారునికి వైద్య చికిత్సలు అందిస్తూనే, మరోవైపు తన కలలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేసింది ఫర్మానీ. ఈ క్రమంలోనే ఇండియన్ […]

Update: 2021-01-05 02:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఫర్మానీ నాజ్‌.. చిన్నప్పటి నుంచే ‘సింగర్’గా రాణించాలని కలలు కన్నది. అయితే ఫర్మానీ ప్రతిభ ప్రపంచానికి తెలిసేలోపే తనకు పెళ్లి కాగా, ఆ తర్వాత కొడుకు కూడా పుట్టాడు. కానీ ఆ బాలునికి పుట్టినప్పటి నుంచే గొంతు సమస్య ఉండటంతో మాట్లాడలేకపోయేవాడు. దీంతో ఓ వైపు కుమారునికి వైద్య చికిత్సలు అందిస్తూనే, మరోవైపు తన కలలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేసింది ఫర్మానీ. ఈ క్రమంలోనే ఇండియన్ ఐడల్ ఆడిషన్స్‌లో పాల్గొని ఎంపికైంది. తన గళంతో సంగీతాభిమానుల ఆదరణ చూరగొంటున్న తరుణంలో.. తన కుమారునికి శస్ర్తచికిత్స జరగడంతో ఆమె ఇండియన్ ఐడల్ నుంచి నిష్ర్కమించింది.

ఆర్థిక పరిస్థితులు.. ఫర్మానీ నాజ్ ప్రతిభకు అడ్డంకిగా మారినా, ఆమె ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. తన తప్పులను తెలుసుకుంటూ, సింగింగ్ టాలెంట్‌ను మెరుగుపరుచుకుంటూ ప్రశంసలు అందుకుంది. ‘సింగర్’గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కలలుకంటున్న తరుణంలోనే.. ‘పెళ్లి’ తన ఆశలకు బ్రేక్ వేసినా, సంగీత సాధన మాత్రం ఆపలేదు. ఆ తర్వాత కుమారుడు పుట్టడం, అతడికి గొంతు సమస్య ఉండటంతో.. వైద్య చికిత్సలు చేయిస్తూనే, వీలునప్పుడల్లా పాటలు పాడుతూ తన యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేసేది. ఫర్మానీ స్వరం బాగుండటంతో తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో పాపులర్ అయింది. ఈ క్రమంలోనే ఇండియన్ ఐడల్‌ ఆడిషన్స్‌లో పాల్గొని, ఎంపిక కావడంతో యూపీలో ఫర్మానీ పేరు మారుమోగిపోయింది. అంతేకాదు కేంద్ర విదేశాంగ మంత్రి సంజీవ్ బాల్యాన్ సైతం ఫర్మానీని స్వయంగా కలిసి అభినందించడంతో పాటు ఆమె కుమారుని ఆపరేషన్‌కు అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చాడు. దాంతో ఆమె సంతోషంగా ఇండియన్ ఐడల్ వేదికపై కాలు మోపి, అక్కడ తన స్వరంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే, ఈ క్రమంలోనే ఫర్మానీ కుమారునికి మీరట్‌లోని ఒక ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. కానీ అతడిని దగ్గరుండి చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో, తన చిన్ననాటి కలను వదిలి వచ్చేసింది. ఎన్నో ఆశలతో ఇండియన్ ఐడల్‌లో అడుగుపెట్టిన ఫర్మానీ.. తన కుమారుని కోసం ఆ షో నుంచి మధ్యలోనే వదిలేసి మాత‌‌‌ృప్రేమను చాటుకుంది.

Tags:    

Similar News