మీరు త్వరగా కోలుకోవాలి : పెద్ద ఎత్తున ప్రార్థనలు
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ కోరుకుంటోంది. అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు అమితాబ్ కు, ఆయన కుమారుడు అభిషేక్ కు కరోనా సోకడం బాధాకరం.. వీరు త్వరగా కోరుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా, అమితాబ్ కు, ఆయన కుమారుడికి కరోనా సోకినట్లు వారే […]
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ కోరుకుంటోంది. అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు అమితాబ్ కు, ఆయన కుమారుడు అభిషేక్ కు కరోనా సోకడం బాధాకరం.. వీరు త్వరగా కోరుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా, అమితాబ్ కు, ఆయన కుమారుడికి కరోనా సోకినట్లు వారే ట్విట్టర్ లో తెలిపారు. ప్రస్తుతం వారు నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు అమితాబ్ భార్యా జయా బచ్చన్, అభిషేక్ భార్య ఐశ్వర్యరాయ్ లు ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే వారికి టెస్టుల్లో నెగెటివ్ వచ్చిన విషయం కొంత ఊరటనిచ్చే అంశం.