SRH ఓటమికి అదే కారణం.. కేన్‌ ఉండాల్సిందే..!

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్ సన్‌రైజర్స్ ఓడిపోవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకపడి భారీ స్కోర్ సాధించారు. ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ కేవలం 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. జానీ బెయిర్‌స్టో, మనీష్ పాండే బాగానే ఆడినా.. జట్టులో కేన్ విలియమ్‌సన్ లేని లోటు మాత్రం తెలిసిపోయింది. మహ్మద్ నబీ బదులు కేన్‌ను తీసుకొని ఉంటే ఛేదనలో బాగుండేదని ఫ్యాన్స్ అంటున్నారు. అతడు […]

Update: 2021-04-12 08:25 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్ సన్‌రైజర్స్ ఓడిపోవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకపడి భారీ స్కోర్ సాధించారు. ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ కేవలం 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. జానీ బెయిర్‌స్టో, మనీష్ పాండే బాగానే ఆడినా.. జట్టులో కేన్ విలియమ్‌సన్ లేని లోటు మాత్రం తెలిసిపోయింది. మహ్మద్ నబీ బదులు కేన్‌ను తీసుకొని ఉంటే ఛేదనలో బాగుండేదని ఫ్యాన్స్ అంటున్నారు. అతడు నాలుగవ స్థానంలో నమ్మదగిన బ్యాట్స్‌మాన్ అని.. అతడు లేకపోవడం వల్లే మిడిల్ ఓవర్స్‌లో SRH స్కోరింగ్ రేట్ తగ్గిపోయిందని విశ్లేషకులు కూడా అంటున్నారు. మరోవైపు అబ్దుల్ సమద్‌ను ముందుగానే పంపాల్సిందని.. గతంలో భారీ స్కోర్లను ఛేదించిన అనుభవం ఆ యువక్రికెటర్‌కు ఉందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఏదేమైనా తొలి మ్యాచ్‌లో జట్టు కూర్పు సరిగా లేదని.. ఈ విషయాన్ని వార్నర్ గమనిస్తే మంచిదని పలువురు హితపు పలుకుతున్నారు.

Tags:    

Similar News