బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి

దిశ, వెబ్‌డెస్క్: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంతక్రియలు తమిళనాడు ప్రభుత్వం అధికార లాంఛనాలతో చెన్నైలోని తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కంలోని నిర్వహించారు. వారి ఆరాధ్య దైవం వీరశైవ జంగమ సంప్రదాయం ప్రకారం… కూర్చొబెట్టి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. కోవిడ్ నిబంధనలతో పరిమిత సంఖ్యలోనే అంత్యక్రియలకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో అభిమానులను ఎవరినీ రానివ్వలేదు. ఫాంహౌజ్‌కు 2 కిలోమీటర్ల మేర బారికెడ్లు ఏర్పాటు చేశారు. కాగా ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి అనిల్ […]

Update: 2020-09-26 01:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంతక్రియలు తమిళనాడు ప్రభుత్వం అధికార లాంఛనాలతో చెన్నైలోని తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కంలోని నిర్వహించారు. వారి ఆరాధ్య దైవం వీరశైవ జంగమ సంప్రదాయం ప్రకారం… కూర్చొబెట్టి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. కోవిడ్ నిబంధనలతో పరిమిత సంఖ్యలోనే అంత్యక్రియలకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో అభిమానులను ఎవరినీ రానివ్వలేదు.

ఫాంహౌజ్‌కు 2 కిలోమీటర్ల మేర బారికెడ్లు ఏర్పాటు చేశారు. కాగా ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంత్యక్రియలకు హాజరై, మృతదేహానికి పూలమలలు వేసి, నివాళ్లర్పించారు. కాగా అనేక మంది ప్రముఖులు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు హాజరై బాలు పార్థివదేహానికి నివాళ్లు అర్పించారు. అంతేగాకుండా చివరిసారిగా బాలు కుటుంబసభ్యులు నివాళ్లు అర్పించారు. ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, మనో, భారతీరాజాలు పాల్గొని నివాళ్లర్పించారు.

Tags:    

Similar News