కేటీఆర్ న్యాయం చేయకపోతే సూసైడ్ చేసుకుంటాం(వీడియో)
దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి పెట్రోల్ డబ్బాతో ఓ కుటుంబం నిరసనకు దిగింది. అధికారులను సైతం లోపలికి రానివ్వకుండా కుటుంబ సభ్యులతో ప్లకార్డులు పట్టుకుని సంతోష్ అనే వ్యక్తి కార్యాలయంలో బైఠాయించాడు. తన కుటుంబానికి న్యాయం చేయకపోతే పెట్రోల్ పోసుకుని ఎంపీడీఓ కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకుంటామన్నారు. అసలు విషయం ఏంటంటే..! తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌కు చెందిన కొందరు అధికార పార్టీ నేతలు తనకు స్థలాన్ని అమ్మారని, ఆ స్థలంలో […]
దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి పెట్రోల్ డబ్బాతో ఓ కుటుంబం నిరసనకు దిగింది. అధికారులను సైతం లోపలికి రానివ్వకుండా కుటుంబ సభ్యులతో ప్లకార్డులు పట్టుకుని సంతోష్ అనే వ్యక్తి కార్యాలయంలో బైఠాయించాడు. తన కుటుంబానికి న్యాయం చేయకపోతే పెట్రోల్ పోసుకుని ఎంపీడీఓ కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకుంటామన్నారు.
అసలు విషయం ఏంటంటే..!
తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌కు చెందిన కొందరు అధికార పార్టీ నేతలు తనకు స్థలాన్ని అమ్మారని, ఆ స్థలంలో ఇంటిని నిర్మిస్తుండగా.. అధికారులకు ఫిర్యాదు చేసి ఇంటికి పర్మిషన్ లేదంటూ జేసీబీతో కూల్చివేసారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు యత్నించగా విషయం బయటకు రాకుండా చేశారన్నారు. మండలంలోని కొందరు ప్రజాప్రతినిధుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి బాధిత కుటుంబానికి 4 లక్షల రూపాయలతో పాటు నివేశ స్థలాన్ని కేటాయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ఒప్పందం జరిగి సంవత్సరమైన ఇంత వరకు న్యాయం జరగలేదని నివేశ స్థలాన్ని ఇవ్వకుండా చుట్టూ తిప్పించుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. తమకు మంత్రి కేటీఆర్ న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.