ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య

దిశ, వెబ్‌డెస్క్: కుటుంబ కలహాల కారణంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. జిల్లాలోని నర్సంపేట పట్టణం వరమ్మతోట కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు లింగమూర్తి(48) కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. నాలుగు నెలల లింగమూర్తి సోదరుడు నవీన్ ఆకస్మికంగా మరణించాడు. దీంతో వీరి కుటుంబంలో ఆస్తి తగాదాలు చోటు చేసుకున్నాయి. తరచూ ఇంట్లో గొడవలు జరుగడం తట్టుకోలేక, తీవ్ర మనస్థాపం చెందిన లింగమూర్తి తల్లిదండ్రులతో పాటు […]

Update: 2021-01-18 22:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: కుటుంబ కలహాల కారణంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. జిల్లాలోని నర్సంపేట పట్టణం వరమ్మతోట కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు లింగమూర్తి(48) కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. నాలుగు నెలల లింగమూర్తి సోదరుడు నవీన్ ఆకస్మికంగా మరణించాడు. దీంతో వీరి కుటుంబంలో ఆస్తి తగాదాలు చోటు చేసుకున్నాయి. తరచూ ఇంట్లో గొడవలు జరుగడం తట్టుకోలేక, తీవ్ర మనస్థాపం చెందిన లింగమూర్తి తల్లిదండ్రులతో పాటు తల్లి సోదరి కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ పెట్టి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం ఇయన ఖానాపూర్ మండలం బుధరావుపేటలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News