రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో ఉష్ణోగ్రతలు 3.4 డిగ్రీలకు పడిపోయాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలిపులి వణికిస్తోంది. రోజు రోజు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో 3.6, కొమురంభీం జిల్లా గిన్నెధరిలో 3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. చలి తీవ్రత అధికంగా ఉంటోంది. రాష్ట్రంలో 20 ప్రాంతాల్లో కేవలం 6 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కామారెడ్డి జిల్లా దొంగిల్లో […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో ఉష్ణోగ్రతలు 3.4 డిగ్రీలకు పడిపోయాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలిపులి వణికిస్తోంది. రోజు రోజు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో 3.6, కొమురంభీం జిల్లా గిన్నెధరిలో 3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. చలి తీవ్రత అధికంగా ఉంటోంది. రాష్ట్రంలో 20 ప్రాంతాల్లో కేవలం 6 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కామారెడ్డి జిల్లా దొంగిల్లో 4.7, ఆదిలాబాద్ జిల్లా బేలలో 5.0, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సత్వర్లో 5.1 డిగ్రీలు నమోదైంది. మరోవైపు హైదరాబాద్లో కూడా చలి పెరుగుతోంది. రాజేంద్రనగర్ పరిధిలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. బీహెచ్ఈఎల్ ప్రాంతంలో 7.8గా ఉంది.