నకిలీ టీఆర్పీ రేటింగ్ స్కాం బట్టబయలు

దిశ, వెబ్‌డెస్క్: పోటీ ప్రపంచంలో తామే ముందుండాలనే దురుద్ధ్యేశంతో నకిలీ టీఆర్పీలతో అక్రమాలకు పాల్పడుతున్న ఓ నేషనల్ చానెల్ బాగోతాన్ని ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. ముంబైలో గురువారం వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. రిపబ్లిక్ టీవీ రేటింగ్‌ను పెంచేందుకు ఆ చానెల్ నిర్వాహకులు తమ టీవీని చూడాలని కోరుతూ రేటింగ్ మీటర్లు ఫిక్స్ చేసిన ఇళ్ల యజమానులకు డబ్బులు పంచుతున్నట్లు తెలిపారు. రిపబ్లిక్ టీవీతోపాటు మరో రెండు చానెల్స్ ఇదే […]

Update: 2020-10-08 09:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: పోటీ ప్రపంచంలో తామే ముందుండాలనే దురుద్ధ్యేశంతో నకిలీ టీఆర్పీలతో అక్రమాలకు పాల్పడుతున్న ఓ నేషనల్ చానెల్ బాగోతాన్ని ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. ముంబైలో గురువారం వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.

రిపబ్లిక్ టీవీ రేటింగ్‌ను పెంచేందుకు ఆ చానెల్ నిర్వాహకులు తమ టీవీని చూడాలని కోరుతూ రేటింగ్ మీటర్లు ఫిక్స్ చేసిన ఇళ్ల యజమానులకు డబ్బులు పంచుతున్నట్లు తెలిపారు. రిపబ్లిక్ టీవీతోపాటు మరో రెండు చానెల్స్ ఇదే విధంగా ఇంటికి రూ.500 చొప్పులు డబ్బులు ఇస్తున్నట్లు నిర్థారించారు. దీనిపై రిపబ్లిక్ టీవీ యాజమాన్యం, డైరెక్టర్లను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ చానెల్ రేటింగ్‌ను హంస కంపెనీ పర్యవేక్షిందని, దానిలోని కొందరు మాజీ ఉద్యోగులు ఈ అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారిలోని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ చానెల్స్ ముంబైలోనే కాకుండా దేశంలో పలు చోట్ల రేటింగ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నట్లు అనుమానాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.

కాగా, రిపబ్లిక్ టీవీ యాజమాన్యంపై వస్తున్న ఆరోపణలపై అర్నాబ్ స్పందించారు. ముంబై పోలీసులు కావాలనే రిపబ్లిక్ టీవీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాల్ఘర్ ఘటన, సుశాంత్ కేసుల్లో రిపబ్లిక్ టీవీ రిపోర్టింగ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని ఆయన ఆరోపించారు. రిపబ్లిక్ టీవీ డిస్ట్రిబ్యూషన్‌ను అడ్డకుంటున్న సంజయ్ రావత్ సోదరుడిపై చర్యలు తీసుకునే దమ్ము ముంబై పోలీసులకు ఉన్నదా అని అర్నాబ్ ప్రశ్నించారు.

Tags:    

Similar News