రూ.30వేలు ఇస్తారా లేదా.. ఫేక్ పోలీసులు అరెస్ట్

దిశ, మియాపూర్ : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మసాజ్ సెంటర్లలో ఫేక్ ఎస్‌ఓటీ పోలీసుల పేరుతో మాములు వసూలు చేస్తున్న ఇద్దరిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నిందితుల వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనం, 2 మొబైల్ ఫోన్స్, 2 నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. మోడెజబా మానిక్ (32), కొత్తగాడి అమర్నాథ్ (33) అనే ఇద్దరు మియాపూర్‌లోని రేవ్ లాన్ బ్యూటీ ఫ్యామిలీ స్టూడియోలో […]

Update: 2021-11-14 10:14 GMT

దిశ, మియాపూర్ : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మసాజ్ సెంటర్లలో ఫేక్ ఎస్‌ఓటీ పోలీసుల పేరుతో మాములు వసూలు చేస్తున్న ఇద్దరిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నిందితుల వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనం, 2 మొబైల్ ఫోన్స్, 2 నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

వివరాల ప్రకారం.. మోడెజబా మానిక్ (32), కొత్తగాడి అమర్నాథ్ (33) అనే ఇద్దరు మియాపూర్‌లోని రేవ్ లాన్ బ్యూటీ ఫ్యామిలీ స్టూడియోలో తాము ఎస్ఓటీ పోలీసులమంటూ ప్రతీనెలా మాములు కింద 30 వేలు డిమాండ్ చేశారు. కాగా.. నిందితులు చివరకు 10 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే మసాజ్ సెంటర్ నిర్వాహకులకు అనుమానం వచ్చి పోలీసులకు నిర్వాహకులు సమాచారం అందించారు. పక్క సమాచారంతో పోలీసులు నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం విచారణలో భాగంగా వారు రెండు వేరు వేరు పత్రికలలో ఇది వరకే పని చేసి మానేసినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని మియాపూర్ పోలీసులకు ఎస్ఓటీ టీం అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మియాపూర్ పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News