మంత్రి గంగులకు ఫేక్ ఈడీ నోటీసులు.. కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్..
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి గంగుల కమలాకర్‌కు ఎన్‌ఫోర్సమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేరుతో ఫేక్ నోటీసులు జారీ అయ్యాయి. ఫేక్ నోటీసులు పంపించి అరెస్టు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు కొందరు దుండగులు. అరెస్టు చేయకుండా ఉండాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన మంత్రి ఈడీ అధికారులను సంప్రదించగా.. మేము ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇది సైబర్ నేరగాళ్ల పని అని తెలుసుకున్న మంత్రి పోలీసులు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా […]
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి గంగుల కమలాకర్‌కు ఎన్‌ఫోర్సమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేరుతో ఫేక్ నోటీసులు జారీ అయ్యాయి. ఫేక్ నోటీసులు పంపించి అరెస్టు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు కొందరు దుండగులు. అరెస్టు చేయకుండా ఉండాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన మంత్రి ఈడీ అధికారులను సంప్రదించగా.. మేము ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని క్లారిటీ ఇచ్చారు.
దీంతో ఇది సైబర్ నేరగాళ్ల పని అని తెలుసుకున్న మంత్రి పోలీసులు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా మంత్రి గంగులకు ఫేక్ ఈడీ నోటీసులు వెళ్లడాన్ని సీరియస్ గా తీసుకున్న ఈడీ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే మంత్రి గంగుల కమలాకర్ కు సంబంధించిన గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.