ఫేస్‌బుక్, వాట్సాప్‌ను హ్యాక్ చేస్తున్న ఫేక్ క్లబ్‌హౌస్
దిశ, ఫీచర్స్ : ‘క్లబ్‌హౌస్’ ఆడియో చాటింగ్ యాప్ పాపులారిటీ ప్రపంచవ్యాప్తంగా క్రమంగా పెరుగుతోంది. ఈ యాప్‌కు ఇండియాలోనూ ఆదరణ దక్కుతుండగా, ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు సైబర్ క్రిమినల్స్ ‘ఫేక్ క్లబ్‌హౌస్’ యాప్‌ను రూపొందించారు. ఈ ఫేక్ యాప్.. వినియోగదారుల ఫోన్‌లో హానికరమైన మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తుండటంతో వాట్సాప్, ఫేస్‌బుక్, తదితర యాప్స్‌కు సైబర్ క్రిమినల్స్ ఇల్లీగల్‌గా యాక్సెస్ అయ్యే అవకాశం కలుగుతోంది. ఈ క్రమంలో మరెన్నో ఆన్‌లైన్ సేవలకు సంబంధించిన వినియోగదారుల లాగిన్ సమాచారాన్ని […]
దిశ, ఫీచర్స్ : ‘క్లబ్‌హౌస్’ ఆడియో చాటింగ్ యాప్ పాపులారిటీ ప్రపంచవ్యాప్తంగా క్రమంగా పెరుగుతోంది. ఈ యాప్‌కు ఇండియాలోనూ ఆదరణ దక్కుతుండగా, ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు సైబర్ క్రిమినల్స్ ‘ఫేక్ క్లబ్‌హౌస్’ యాప్‌ను రూపొందించారు. ఈ ఫేక్ యాప్.. వినియోగదారుల ఫోన్‌లో హానికరమైన మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తుండటంతో వాట్సాప్, ఫేస్‌బుక్, తదితర యాప్స్‌కు సైబర్ క్రిమినల్స్ ఇల్లీగల్‌గా యాక్సెస్ అయ్యే అవకాశం కలుగుతోంది. ఈ క్రమంలో మరెన్నో ఆన్‌లైన్ సేవలకు సంబంధించిన వినియోగదారుల లాగిన్ సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.
ఫేక్ యాప్‌లోని డేంజరస్ బ్లాక్ రాక్ మాల్వేర్.. ఫైనాన్షియల్, క్రిప్టో కరెన్సీ, ఎక్స్‌చేంజెస్, వాలెట్స్, సోషల్, షాపింగ్ యాప్స్ వంటి 458 రకాల యాప్స్ నుంచి సమాచారాన్ని సేకరించగలదు. క్లబ్‌హౌస్ కేవలం ఐవోఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండటంతో, గూగుల్ ప్లే స్టోర్ కాకుండా వెబ్‌సైట్ ద్వారా మాల్‌వేర్‌ను ఫోన్‌కు సెండ్ చేస్తున్నారు. సైబర్ క్రిమినల్స్ పంపించిన లింక్‌లో దీన్ని గూగుల్ ప్లే స్టోర్‌లో పొందండి అని ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేయగానే, యాప్ ఫోన్‌లో ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుంది. దాంతో గూగుల్ ప్లే స్టోర్ వెళ్లే అవకాశం లేకుండానే ఇన్‌స్టాల్ అయిపోతుంది.
ఫేక్ యాప్ విషయంలోనే ఇలా జరుగుతుంది. ఎందుకంటే.. సాధారణంగా గూగుల్ ప్లే స్టోర్‌కు చెందిన యాప్ అయితే.. అది మొదట ప్లే స్టోర్ సైట్‌లోనే ఓపెన్ అవుతుంది. సదరు యాప్‌ను పొందడానికి డౌన్‌లోడ్ బటన్‌ను మాన్యువల్‌గా నొక్కాలి. కాబట్టి ఈ యాప్ నకిలీదని స్పష్టంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు లింక్‌లో సైట్.comకు బదులుగా మొబీని సూచిస్తుంది. ఈ విషయాలను జాగ్రత్తగా గమనిస్తే.. ఫేక్ క్లబ్ హౌస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయకుండా ఉండొచ్చు.